‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన భామల్లో భాను శ్రీ ఒకరు. ‘జాబిలమ్మ’ ‘వాని రాణి’ వంటి సీరియల్స్ తో పాటు ‘గోల్డ్ రష్’ ‘టాలీవుడ్ స్క్వేర్స్’ వంటి టీవీ షోలతో ఈమె కెరీర్ ప్రారంభించింది. తర్వాత ‘ఇద్దరి మధ్య 18’ ‘మర్ల పులి’ ‘నల్లమల’ ‘కుమారి 21ఎఫ్’ ‘బాహుబలి ది బిగినింగ్’ ‘కాటమరాయుడు’ ‘7 చేపల కథ’ వంటి సినిమాల్లో నటించినా ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు.

Bhanu Sree

కానీ ‘బిగ్ బాస్ సీజన్ 2’ తో ఈమెకు పాపులారిటీ వచ్చింది. ఆ షోలో మొదట ఈమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ తర్వాత పక్కవాళ్ళ మాటలకు మేనిప్యులేట్ అయిపోవడం వల్ల వీకైపోయింది.

అటు తర్వాత పలు టీవీ షోలలో సందడి చేసింది. ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ సినిమాలోని ‘గెలుపు తలుపులే’ పాట పాడి విపరీతంగా ట్రోల్ అయ్యింది.దాని వల్ల మళ్ళీ ఈమె వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ భాను అనే ఒకామె ఉంది అని జనాలు కూడా గుర్తుచేసుకున్నట్టు అయ్యింది.ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో భాను శ్రీకి మంచి క్రేజ్ ఉంది. ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు హాట్ టాపిక్ అవుతుంటాయి.

అందుకే అప్పుడప్పుడు పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి ఈమెను గెస్ట్ గా పిలుస్తుంటారు. అలా ఈమె క్యాష్ చేసుకుంటూ ఉంటుంది.అయితే కొన్నాళ్ల నుండీ భాను సైలెంట్ అయ్యింది. అయితే ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ తో మళ్ళీ హాట్ టాపిక్ అయ్యింది. ‘పట్టు చీరలో చందమామ’ అంటూ ఆమె షేర్ చేసిన అందమైన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి

రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus