నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన డివైన్ మాస్ ఎంటర్టైనర్ ‘అఖండ 2’. 2021 లో వచ్చిన ‘అఖండ’ పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ కావడంతో ‘అఖండ 2’ పై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమాపై హైప్ ఇంకా పెరిగింది.
బాలకృష్ణ మాస్ సినిమా చేస్తే తిరుగుండదు అనే బలమైన నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అదే బోయపాటి దర్శకత్వంలో చేస్తే స్యూర్ షాట్ హిట్ అని అంతా ఫిక్సయిపోతారు. అందుకు తగ్గితే సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. కానీ ఇంతలో ఓ చిక్కొచ్చి పడింది. ‘ఎరోజ్ ఇంటర్నేషనల్’ సంస్థ ‘అఖండ 2’ నిర్మాతలపై పిటిషన్ దాఖలు చేసింది. దానికి కోర్టు కూడా స్వీకరించి ఇంజెక్షన్ ఆర్డర్ తేవడం జరిగింది.
అందువల్ల ‘అఖండ 2’ రిలీజ్ ఉండదేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆ ఇష్యూ సాల్వ్ అయ్యి తమిళనాడులో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అలాగే తెలంగాణాలో కూడా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. సింగిల్ స్క్రీన్స్ లో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. వచ్చిన ఓపెనింగ్స్ లో 20 శాతం ‘మూవీ ఆర్ట్స్ అసోసియేషన్’ సంక్షేమం కోసం ఉపయోగిస్తారట.
అయితే ‘అఖండ 2’ టికెట్ హైక్స్ అనేవి ఓపెనింగ్ వీకెండ్ వరకు మాత్రమే అమల్లో ఉంటాయి. ఒక రకంగా ఇది మంచి ఆలోచనే. మొదటి వీకెండ్ ఫ్యాన్స్ అండ్ రెగ్యులర్ సినిమా లవర్స్ సినిమాని వీక్షించినా.. వీకెండ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కి అనుకూలంగా ఉంటుంది.