వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) ఇటీవల పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. చిరకాల ప్రేయసి హరిణ్య రెడ్డితో పెద్దల సమక్షంలో ఇటీవల ఏడడుగులు వేశాడు. హైదరాబాద్ లోనే వీరి పెళ్ళి సింపుల్ గా జరిగింది. టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు, బుల్లితెర సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు వీరికి పెళ్ళికి హాజరయ్యి.. నూతన వధూవరులను బ్లెస్ చేశారు.వీరి పెళ్ళి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Rahul Sipligunj

రాహుల్ సిప్లిగంజ్ కి తన ఫాలోవర్స్ అంతా బెస్ట్ విషెస్ చెప్పారు. ‘అన్న ఒక ఇంటివాడు అయ్యాడు’ ‘కంగ్రాట్స్ భాయ్’ ‘సూపర్ చిచ్చా’ అంటూ అంతా కామెంట్లు పెట్టి ఆల్ ది బెస్ట్ చెప్పారు. రాహుల్-హరిణ్య బెస్ట్ పెయిర్ అంటూ ఇంకొందరు అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే.. పెళ్ళి తర్వాత ఈ జంట హానీమూన్ కి వెళ్లడం జరిగింది. దాని కోసం మాల్దీవ్స్ ను తమ హనీమూన్ స్పాట్ గా ఫిక్స్ చేసుకున్నారు.

 

అక్కడ ఈ జంట బాగా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ వీరు కలిసి తీసుకున్న ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ నీళ్లలో తన భార్యతో దిగిన రొమాంటిక్ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇద్దరూ సరదాగా చిల్ అవుతూ హ్యాంగౌట్ అవుతున్నట్టు స్పష్టమవుతుంది. ఈ ఫోటోని మరికొంతమంది షేర్ చేసి ‘కపుల్ గోల్స్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమాల పరంగా చూసుకుంటే.. పెద్ద సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పడుతున్న రాహుల్.. ‘రంగమార్తాండ’ అనే సినిమాతో నటుడిగా కూడా మారిన సంగతి తెలిసిందే.

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus