Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 9, 2026 / 09:15 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నిఖిల్ గాజుల (Hero)
  • అన్యుక్త నల్లాని (Heroine)
  • సౌందర్య లహరి, ఎం సి హరి, హృతిక్ శెట్టి, జెమినీ సురేష్, సునీత మనోహర్ తదితరులు (Cast)
  • చాణక్య జిల్లా (Director)
  • రమేష్ జిల్లా (Producer)
  • నిర్వాన్ ఆత్రేయ (Music)
  • అన్వేష్ యాదవ్ (Cinematography)
  • తరుణ్ రెడ్డి (Editor)
  • Release Date : 9th అక్టోబ‌ర్‌ 2026
  • ఎకో క్రాఫ్ట్ మీడియా (Banner)

ఆదర్శ కుటుంబం వంటి పెద్ద సినిమా తప్పుకోవడంతో .. ఆ స్పేస్ ను వాడుకునేందుకు చాలా చిన్న సినిమాలు రెడీ అయ్యాయి. అందులో ‘గుడ్ టైమ్’ కూడా ఒకటి. ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టి ఆకర్షించిన ఈ సినిమా.. ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుందో తెలుసుందాం రండి:

Good Time Movie Review

Good Time Movie Review and Rating

కథ: జానకి రామ్ అలియాస్ జానీ (నిఖిల్ గాజుల) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన యువకుడు. ఇంటర్ తర్వాత చదువుకి గుడ్‌బై చెప్పేసి క్యాబ్ డ్రైవర్‌గా చేరతాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో అప్పులు తీర్చే బాధ్యతను ఇతని తల్లి (సునీతా మనోహర్) నెత్తిన వేసుకుంటుంది. ఇక జానీ తన సంపాదన మొత్తం బెట్టింగులకే తగలేస్తుంటాడు. అడ్డదారుల్లో డబ్బులు సంపాదించే క్రమంలో అతను సంపాదించినదంతా పోగొట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు క్రిస్టియన్ అమ్మాయి నిశ్చలతో (అన్యుక్త నల్లని) పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. ఆమె కోసం తన స్తోమతకు మించి ఐఫోన్ల వంటి ఖరీదైన గిఫ్టులు ఇస్తుంటాడు. వాటి కోసం బైక్ రైడర్ గంగ (ఎం.సి. హరి) వద్ద లక్షల్లో అప్పులు చేస్తుంటాడు. ఒకరోజు అనుకోకుండా జానీ వల్ల గంగ ఇగో హర్ట్ అవుతుంది. దీంతో తన అప్పును వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేస్తుంటాడు. అంతేకాదు, జానీ తల్లి కూడా అనుకోని కారణాల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఈ సమస్యల నుండి జానీ, అతని ఫ్యామిలీ ఎలా బయటపడ్డారు? రుక్మిణి (సౌందర్య లహరి) కారణంగా జానీ జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.

నటీనటుల పనితీరు: ఈ సినిమాలో తెలిసిన నటీనటులు చాలా తక్కువ. జెమినీ సురేష్, సునీతా మనోహర్ తప్ప దాదాపు అంతా కొత్తవారే. అయినప్పటికీ అందరూ బాగా చేశారు. నిఖిల్ గాజుల ‘జానీ’ పాత్రను ఎంతో ఈజ్‌తో క్యారీ చేశాడు. ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది. హీరోయిన్ అన్యుక్త కూడా మొదటి సినిమాతోనే అందరి దృష్టినీ ఆకర్షించిందనే చెప్పాలి. గ్లామర్‌తో పాటే ఎక్స్‌ప్రెషన్స్ కూడా బాగా పలికించింది. తల్లి పాత్రలో సునీత మనోహర్ తన మార్క్ నటనతో మెప్పించింది.. అక్కడక్కడా కామిడీ కూడా పండించింది. జెమినీ సురేష్ గోదావరి యాసతోనే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. కానీ, ఈ సినిమాలో అతనితో తెలంగాణ యాస మాట్లాడించారు. అది అతనికి అంతగా సెట్ అవ్వలేదు. ఉత్తేజ్‌తో చేయించాల్సిన పాత్రను ఇతనితో చేయించారేమో అనిపిస్తుంది. రుక్మిణి పాత్రలో సౌందర్య లహరి కనిపించింది కాసేపే అయినా పర్వాలేదనిపించింది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో పాటు, ‘అమీర్ లోగ్’ ఫేమ్ ఎం.ఎస్. హరి కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

Good Time Movie Review and Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ మధ్య కాలంలో హైదరాబాదీ బ్యాక్‌డ్రాప్‌లో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. ‘ఫలక్‌నుమా దాస్’ ‘దీవానా’ నుండి చూసుకుంటే మొన్నామధ్య వచ్చిన ‘అమీర్ లోగ్’ అలాగే ఇటీవల వచ్చిన ‘ది ప్యారడైజ్’ కూడా ఆ కోవకి చెందినవే. ఇప్పుడు ‘గుడ్ టైం’ కూడా ఆ జాబితాలో చేరుతుంది. దర్శకుడు చాణక్య జిల్లా జెన్-జి యువతని దృష్టిలో పెట్టుకుని ఈ కథని తెరకెక్కించినట్టు ఉన్నాడు. నేటితరం యువతలో ఉన్న క్యూరియాసిటీ, అన్నీ ఇన్‌స్టంట్‌గా దక్కించుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ డబ్బు సంపాదించేందుకు అడ్డదారులను ముఖ్యంగా గ్యాంబ్లింగ్‌ను ఎంచుకోవడం, అమ్మాయిల కోసం.. ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం అప్పులు చేసి చిక్కుల్లో పడటం, ఆ ఒత్తిడిలో మాదకద్రవ్యాలకు బానిసైపోవడం… ఇలా దర్శకుడు ప్రధానంగా ఈ 3 పాయింట్లనే టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది.మంచి లైనే ఇది. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా సాగుతుంది, ఎంటర్‌టైన్‌మెంట్ సమపాళ్ళలో కనిపించింది. అయితే సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పింది. మెసేజ్‌కి, ఎంటర్‌టైన్‌మెంట్‌కి మధ్య టేకింగ్ గాడితప్పిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో విలన్‌తో బైక్ రేసింగ్ ఎపిసోడ్ పెట్టాడు దర్శకుడు.

దానికి ముందు హీరో, విలన్‌తో పెద్ద లెవెల్లో ఛాలెంజ్ చేస్తాడు. కానీ ఇద్దరిలో ఎవరు గెలిచారు, అక్కడ ఏమైంది? అనేది కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయలేదు. క్లైమాక్స్‌లో రుక్మిణి ట్రాక్ బాగుంది. హీరోకి ఆమె ఫాదర్‌తో చెప్పించిన ఫిలాసఫీ ఆలోచింపజేస్తుంది, నవ్విస్తుంది, అలాగే ఒక మంచి కన్‌క్లూజన్ ఇచ్చిన ఫీలింగ్ కూడా ఇస్తుంది. కానీ మళ్ళీ సాగదీసి హీరో దుబాయ్‌కి వెళ్లినట్టు చూపించడం అనవసరం అనిపిస్తుంది. అవి పక్కన పెట్టేస్తే.. ఈ మధ్య కాలంలో ఓ చిన్న సినిమా ఇంత క్వాలిటీగా ఉండటం చాలా తక్కువగా చూస్తున్నాం. ‘గుడ్ టైం’ సినిమా నిర్మాతలు ఈ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగున్నాయి. సెకండాఫ్ లో కొంత ట్రిమ్ చేస్తే బాగుండేది. అలాగే ఇంతకు ముందు చెప్పుకున్న బైక్ రేసింగ్ ఎపిసోడ్ కి కన్క్లూజన్ ఇస్తూ కొన్ని విజువల్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. థియేటర్ సంగతి ఎలా ఉన్నా.. ఓటీటీ వెర్షన్ కోసమైనా ఈ కరెక్షన్ చేస్తే బాగుంటుంది.

Good Time Movie Review and Rating

విశ్లేషణ: ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్లిన ఆడియన్స్ ని.. ‘గుడ్ టైమ్’ కొంత ఎంటర్టైన్ చేసి పంపిస్తుంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది. సెకండాఫ్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమాకి అప్రీషియేషన్ పెరగొచ్చు.

ఫోకస్ పాయింట్: గుడ్ అటెంప్ట్

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anyuktha Nallani
  • #Chanakya Jilla
  • #Good Time
  • #Good Time Movie
  • #Nikhil Gajula

Reviews

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

55 mins ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

10 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

4 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

5 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

5 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version