ప్రపంచవ్యాప్తంగా గూఢచారి మూడు రోజుల కలక్షన్స్!

  • August 7, 2018 / 06:13 AM IST

యువ దర్శకుడు శశికాంత్‌ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన గూఢచారి గత శుక్రవారం రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకం పై అభిషేక్‌ నామా నిర్మించిన ఈ సినిమాలో అడవి శేషు అదరగొట్టారు. క్షణం తర్వాత ఏడాది గ్యాప్ తీసుకొని చేసిన ఈ మూవీ సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, హీరో సమంత సోదరి అయిన సుప్రియ 22 ఏళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా మళ్లీ తెరపై కనిపించారు. రీ ఎంట్రీ లోను సూపర్ అనిపించారు. ఇందులో హీరోయిన్ గా నటించిన శోభితతో పాటు మిగతావారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రం మూడు రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) ప్రపంచవ్యాప్తంగా 4.39 కోట్ల షేర్ రాబట్టింది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు…

ఏరియా : కలక్షన్స్
నైజాం : 1.26 కోట్లు
సీడెడ్ : 0.25 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.40 కోట్లు
గుంటూరు : 0. 23 కోట్లు
కృష్ణ : 0. 29 కోట్లు
ఈస్ట్ గోదావరి : 0.20 కోట్లు
వెస్ట్ గోదావరి : 0.13 కోట్లు
నెల్లూరు : 0.08 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో :2.85 కోట్లు
ఇతర ప్రాంతాల్లో : 0.10 కోట్లు
కర్ణాటక :0. 35
ఓవర్సీస్ : 1.09 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా : 4.39 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus