Gopal Reddy: నాగ్‌ పాన్‌ ఇండియా సినిమా మిస్‌ అయ్యాం తెలుసా?

పాన్‌ ఇండియా సినిమా అని మనం ఇప్పుడు అంటున్నాం కానీ… 27 ఏళ్ల క్రితమే ఓ పాన్‌ ఇండియా సినిమాకు బీజం పడింది తెలుసా? అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ సినిమా విడుదలై భారీ విజయం సాధించేది. ఆ సినిమాలో హీరో అక్కినేని నాగార్జున. దర్శకుడు ఎస్‌.గోపాల్‌ రెడ్డి. అదేంటి ఆయన సినిమాటోగ్రాఫర్‌ కదా అంటారా. అవును నిజమే.. కానీ ఆయన నాగార్జునతో ఓ పాన్‌ ఇండియా సినిమా డైరెక్ట్‌ చేయాలనుకున్నారట.

‘హలోబ్రదర్‌’ సినిమా సమయంలోనే ఎస్‌.గోపాల్‌ రెడ్డి ఈ పాన్‌ ఇండియా ప్లాన్‌ చేశారట. అయితే కథ మరీ ఆర్ట్‌ ఫిల్మ్‌లా ఉందని కొన్ని మార్పులు సూచించారట. దానికి గోపాల్‌రెడ్డి ససేమిరా అనడంతో ఆ సినిమా అక్కడితో ఆగిపోయింది. లేదంటే మన తొలి పాన్‌ ఇండియా మూవీ వచ్చి 27 ఏళ్లు అయిపోయేది. నాగార్జున మన తొలి పాన్‌ ఇండియా హీరో కూడా అయ్యేవాడు. నాగ్‌ ‘బ్రహ్మాస్త్ర’తో ఇప్పుడు పాన్‌ ఇండియాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఎస్‌.గోపాల్‌ రెడ్డి అంటే… రాఘవేంద్రరావు ఆస్థాన సినిమాటోగ్రాఫర్‌ అనే చెప్పాలి. వారిద్దరి మధ్య మంచి సింక్‌ ఉండేదట. అలా వారికి మాత్రమే అర్థమయ్యేలా షూటింగ్‌ స్పాట్‌లో మాట్లాడుకుని పని చేసేవారట. అయితే గోపాల్‌ రెడ్డి చాలా కోపం… సెట్స్‌లో పని అనుకున్నట్లు సాగకపోతే తిట్టేసేవారట. అలా గోపాల్‌ రెడ్డితో తిట్లు తినని దర్శకుడు ఎవరన్నా ఉన్నారా అంటే అది రాఘవేంద్రరావేనట.

Most Recommended Video



పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus