శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై గోపీచంద్ 25వ చిత్రం `పంతం`

`ఆంధ్రుడు`, `య‌జ్ఞం`, `ల‌క్ష్యం`, `శౌర్యం`, `లౌక్యం` వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది గోపీచంద్ 25వ చిత్రం కావ‌డం విశేషం. దీనికి `పంతం అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. `ఫ‌ర్ ఎ కాస్‌` ఉప‌శీర్షిక‌. `బ‌లుపు`, `ప‌వ‌ర్‌`, `జై ల‌వకుశ` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు స్క్రీన్‌ప్లే అందించిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ను కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..

నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ – “మా స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో గోపీచంద్‌గారి 25వ సినిమా చేయ‌డం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు `పంతం` అనే టైటిల్‌ను నిర్ణ‌యించాం. సినిమా అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అందులో భాగం ఇప్ప‌టికే ఒక పాట‌, కొంత టాకీ పార్ట్ పూర్త‌య్యింది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశాలను అల్యూనిమియం ఫ్యాక్టరీలో చిత్రీకరించబడింది. మంచి మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమాను ద‌ర్శ‌కుడు చ‌క్రి చ‌క్క‌గా తెర‌కెక్కిస్తున్నారు. హీరో గోపీచంద్‌గారి క్యారెక్ట‌ర్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయ‌న ఎందుకోసం పంతం ప‌ట్టాడు. ఆ కార‌ణ‌మేంట‌నేది తెలుసుకోవాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అని తెలిపారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus