Gopichand: ఇంటర్వ్యూ : ‘రామబాణం’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు

  • May 6, 2023 / 03:48 PM IST

గోపీచంద్ నటించిన ‘రామబాణం’ సినిమా మే 5న విడుదల కాబోతోంది. శ్రీవాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రమోషన్లలో జగపతి బాబు పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ విశేషాలు మీకోసం :

ప్ర.’రామబాణం’ ఎలా మొదలైంది?

గోపీచంద్ : గత కొంతకాలంగా నేను ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తున్నాను. ఫ్యామిలీ సినిమా చేసి చాలా కాలమైంది అనిపించింది. అందుకే వాసు నా దగ్గరకు వచ్చి యాక్షన్ ఫిల్మ్ చేద్దామంటే…. వద్దు మొత్తం యాక్షన్ అయిపోతుంది. మనం చేసిన లక్ష్యం, లౌక్యం సినిమాల మాదిరి యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండే సినిమా కావాలి అంటే… భూపతిరాజా గారు చెప్పిన కథని మార్పులు చేసి ‘రామబాణం’ గా మలిచాడు. అలా ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయ్యింది.

ప్ర.ఇందులో జగపతి బాబు గారు కూడా ఉన్నారు. మళ్ళీ ఆయన మీకు అన్నయ్య పాత్ర చేశారు.? ‘లక్ష్యం’ కి దీనికి పోలిక ఏమైనా ఉంటుందా?

గోపీచంద్ : లేదు.. లక్ష్యం కి, రామబాణం కి అస్సలు సంబంధం ఉండదు. రెండూ కూడా వేరు వేరు కథలు. లక్ష్యం, లౌక్యం సెంటిమెంట్ ని కొనసాగిస్తూ అలాంటి టైటిల్ పెడితే బాగుంటుందని వాసు అన్నాడు. అయితే అనుకోకుండా అన్స్టాపబుల్ షోకి వెళ్ళడం, అక్కడ బాలకృష్ణ గారు ‘రామబాణం’ అనే టైటిల్ ను మా సినిమాకి ఫిక్స్ చేయడం జరిగింది.

ప్ర. జగపతిబాబు గారితో మూడోసారి కలిసి నటిస్తున్నారు? ఆయనతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది?

గోపీచంద్ : జగపతిబాబు గారితో నాకిది మూడో సినిమా. ఆయన్ని కలిస్తే సొంత అన్నయ్యను కలిసినట్టే ఉంటుంది. నేను ఆయనను అన్నయ్య అనే పిలుస్తుంటాను. ఆయనతో నటిస్తుంటే ఒక యాక్టర్ తో చేసినట్టు ఉండదు, అన్నయ్యతో చేసినట్టే ఉంటుంది. అందుకే మా మధ్య సన్నివేశాలు బాగా వస్తాయి. ఈ సినిమా అన్నదమ్ముల కథ. ఇద్దరి స్వభావం ఒకటే. కానీ ఎంచుకున్న దారులు వేరు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి.

ప్ర.రామబాణం కథలో మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి?

గోపీచంద్ : భూపతి రాజా గారు ఈ కథ చెప్పినప్పుడు ఒక ప్రేక్షకుడిగా నేను ఎక్కువగా కనెక్ట్ అయ్యాను. ఓ కమర్షియల్ సినిమా లో మెసేజ్ ఇవ్వడం అనేది చాలా కష్టం. ఈ సినిమాలో అది కుదిరింది. కమర్షియల్ ఫార్మాట్ లో వెళ్తూనే.. ఒక మంచి సందేశం ఉంటుంది. ఇదేం కొత్త మెసేజ్ కాదు. మన చుట్టూ జరుగుతున్నదే. కానీ మనం దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నాం. అయితే కొన్నేళ్ల తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలీదు.. కానీ తర్వాత బాధ పడతాం. అదే విషయాన్ని ఇందులో చూపించబోతున్నాం.

ప్ర.హిట్ వస్తుంది అని భావించి.. శ్రీవాస్ గారితో సినిమా చేశారా?

గోపీచంద్ : అలా అస్సలు కాదు. హిట్ కాంబినేషన్ ని నమ్మి ఉంటే ఇంత సమయం ఎందుకు తీసుకుంటాం. లక్ష్యం కి, లౌక్యం కి 7 ఏళ్ళు గ్యాప్ ఉంది. అలాగే ‘లౌక్యం’కి.. ‘రామబాణం’ కి 7 ఏళ్ళు గ్యాప్ ఉంది. మధ్యలో ఒకసారి వాసు చేద్దామన్నారు కానీ నేనే వద్దు అన్నాను. మన కాంబోలో రెండు హిట్లు వచ్చాయి. మూడో సినిమా వాటిని మించే సినిమా కావాలి అన్నాను. అలాంటి సినిమానే రామబాణం.

ప్ర. ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతి మారింది.. ఏదో ఒక కొత్తదనం ఉంటే తప్ప జనాలు థియేటర్ కు రావడం లేదు? ఈ నేపథ్యంలో రామబాణం చేయడానికి మీ కాన్ఫిడెన్స్ ఏంటి?

గోపీచంద్ : ఇప్పుడు అమ్మని మమ్మీ అంటున్నారు. అన్నయ్యని బ్రో అంటున్నారు. పిలుపులే మారాయి. ఎమోషన్స్ మారలేదు. ఎన్నేళ్ళు అయినా ఎమోషన్స్ మారవు. అలాగే ఉంటాయి. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. వాళ్ళు ఆదరించలేదంటే వాళ్ళని మెప్పించే సినిమా మనం తీయలేదని అర్థం.ఆడియన్స్ టేస్ట్ ఏమీ మారలేదు.

ప్ర. ‘సీటిమార్’ మంచి సినిమా.. కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అంటుంటారు? దాని పై మీ అభిప్రాయం?

గోపీచంద్ : ‘సీటిమార్’ ఆడింది. సూపర్ హిట్ అని నేను చెప్పను. కానీ సక్సెస్ అయ్యింది. అయితే ఏవో కారణాల వల్ల కొన్నిసార్లు ఆశించినంత ఫలితం రాకపోవచ్చు. ఎలాంటి టైంలో ఆ సినిమా రిలీజ్ అయ్యింది అనే దానిపై కూడా ఫలితామనేది ఆధారపడి ఉంటుందని. ఏ సినిమా బాగా ఆడుతుంది, ఏ సినిమా ఆడదు అని మనం చెప్పలేం. మన మంచి సినిమా చేసి కూడా ఆశించిన స్థాయి విజయం దక్కలేదంటే.. దానిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో తప్పు జరిగింది అని చెప్పాలి.

‘పక్కా కమర్షియల్’ కూడా నిరాశపరిచింది కదా?

గోపీచంద్ : ఆడుతుందని భావించాం. కానీ ఆడలేదు. అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి కరెక్ట్ చేసుకొని ఉంటే బాగుండేది. అది కేవలం ఏ ఒక్కరి తప్పో కాదు. అందరం కలిసి టీమ్ వర్క్ చేశాం. మేం దాన్ని నమ్మాం.. కానీ ఆశించిన సక్సెస్ రాలేదు.

‘సాహసం’ సినిమా ఈ టైం లో వస్తే బాగా ఆడేదేమో కదా?

గోపీచంద్ : అవును. సాహసం, ఒక్కడున్నాడు కూడా..! ఈ రెండు సినిమాలు ఈ టైంలో చేస్తే చాలా పెద్ద హిట్లు అవుతాయి. అలాంటి కథలు నా దగ్గరకు వస్తే నేనెప్పుడూ చేయడానికి సిద్ధంగానే ఉంటాను.

20 ఏళ్ల కెరీర్ లో మీరు మిస్ చేసుకున్న హిట్ సినిమాలు లేదా పాత్రలు ఏమైనా ఉన్నాయా?
గోపీచంద్ : అలా ఎప్పుడూ జరగలేదు. కానీ ఏదైనా మంచి రోల్ చూసినప్పుడు ఇది మనకు వచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ఈమధ్య హీరోలు కొత్త దర్శకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు.. మీరు ఎవరైనా కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తున్నారా?

గోపీచంద్ : నా కెరీర్ లో ఎక్కువగా కొత్త దర్శకులతోనే చేశాను. కథ నచ్చితే కొత్త దర్శకులతో కచ్చితంగా చేస్తాను.

శ్రీను వైట్ల గారితో సినిమా ఉంటుందా?

గోపీచంద్ : స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. కొంచెం టైం పడుతుంది. హర్ష గారి సినిమా తర్వాత ఉంటుంది.

ప్రభాస్ సినిమాలో విలన్ రోల్ చేసే అవకాశం వస్తే చేస్తారా?

గోపీచంద్ : కచ్చితంగా చేస్తాను. నన్ను నిలబెట్టింది కెరీర్ స్టార్టింగ్ లో చేసిన విలన్ పాత్రలే. అంతటి పవర్ ఫుల్ రోల్స్ వస్తే ఎవరి సినిమాలో అయినా నటించడానికి సిద్ధంగానే ఉన్నాను.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus