Pawan Kalyan: పవన్ తో సినిమా అంటే కష్టమేమో!

దర్శకుడు గోపీచంద్ మలినేని మొదటి నుంచి తెలుగులో కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. కొన్నాళ్లక్రితం ఆయన తీసిన ‘క్రాక్’ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో అతడికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ చూసే బాలయ్య తనతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్ లో ‘వీర సింహారెడ్డి’ అనే సినిమా వచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఇండస్ట్రీకి మరో బోయపాటి దొరికాడంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే గోపీచంద్ మలినేని నెక్స్ట్ సినిమా ఏంటనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అయితే ఆయన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘క్రాక్’ సినిమా తరువాత బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కోసం రెండు కథలు రెడీ చేసుకున్నాడట గోపీచంద్ మలినేని.

‘క్రాక్’ సినిమా రిలీజ్ కాకముందే.. మైత్రి మూవీ మేకర్స్ గోపీచంద్ మలినేనితో సినిమా ఫిక్స్ చేశారు. అప్పటికి తన దగ్గర బాలయ్య, పవన్ కళ్యాణ్ కోసం కథలు రెడీగా ఉన్నాయని చెప్పారు గోపీచంద్ మలినేని. బాలకృష్ణ సినిమా సెట్స్ పైకి వెళ్లిందని.. పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథ కూడా బాగుంటుందని చెప్పుకొచ్చారు. అవకాశం వస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని అన్నారు.

మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అంటే తనకు ఎంతో అభిమానమని.. తను వాళ్ల అభిమానినని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నాయి. దాదాపు మూడు సినిమాలను పూర్తి చేయాలి. ఆ తరువాతే మరో సినిమా సైన్ చేయగలరు. మధ్యలో ఎలెక్షన్స్ కూడా ఉన్నాయి. అలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఇప్పట్లో కష్టమే.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus