గోపిచంద్ ద్విపాత్రాభినయం!

హీరో గోపిచంద్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గోపిచంద్ ద్విపాత్రాభినయం చేయబోతునట్లు సమాచారం. ఇప్పటివరకు గోపిచంద్ డ్యూయల్ రోల్స్ లో కనిపించిందే లేదు. మొదటిసారిగా ఆయన రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. దీనికోసం దర్శకుడు సంపత్ కథ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడట.

ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్స్ ను ఎంపిక చేయనున్నారు. అందులో ఒకరు కేథరిన్ అని టాక్. మరొక హీరోయిన్ ఎవరనే విషయం తెలియాల్సివుంది. గోపిచంద్ ప్రస్తుతం ‘ఆక్సిజన్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత సంపత్ నంది సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా సంపత్ నంది స్టయిల్ లో ఉండే పక్కా కమర్షియల్ సినిమా అని చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus