గోపీచంద్ కు దిల్ రాజు బంపర్ ఆఫర్

విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం ’96’ ఎంత ఘానా విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీపావళి రోజున ’96’ చిత్రాన్ని టీవీల్లో టెలికాస్ట్ చేసినప్పటికీ థియేటర్లలో హౌస్ ఫుల్ అవ్వడం విశేషం. అంతలా జనాధారణ పొందిన ఈ చిత్రం తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్నారు సక్సెసఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. గత కొన్ని రోజుల నుండీ ఈ చిత్రంలో హీరో ఎవరనే దానిపై చర్చ జరుగుతుంది.

మొదట నాని పేరు వినిపించింది. అయితే అది నిజం కాదని ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్ర ప్రమోషన్లో దిల్ రాజు తేల్చి చెప్పేసారు. తరువాత అల్లు అర్జున్ అన్నారు. తాజాగా అల్లు అర్జున్ నటించేది నిజమే అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ రీమేక్ ను బన్నీ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ ఆఫర్ గోపీచంద్ ను వరించిందంట. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను గోపీచంద్ తో ప్లాన్ చేస్తున్నాడట. తెలుగులో కూడా త్రిష నే హీరోయిన్ గా నటించనుందని టాక్. గతంలో ‘వర్షం’ ‘శంఖం’ చిత్రాలలో త్రిష, గోపీచంద్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. మరి ఇది ఎంత వరకూ నిజమో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus