ఇట‌లీ, మిలాన్‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌ర‌పుకుంటోన్న `చాణ‌క్య‌`

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `చాణక్య‌`. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం నేతృత్వాన‌ ఇట‌లీ, మిలాన్‌లో పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ పాట‌ల చిత్రీక‌ర‌ణ షూటింగ్ విశేషాల‌ను అక్క‌డి లోక‌ల్ ఎల‌క్ట్రానిక్ మీడియా స్పెష‌ల్‌గా టెలికాస్ట్ చేయ‌డం విశేషం. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్‌.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus