OTT: షాకింగ్ డెసిషన్ తీసుకున్న ప్రభుత్వం..అడల్ట్ కంటెంట్ కు చోటు లేదు!

ఓటీటీ కంటెంట్ హద్దులు దాటుతుంది అంటూ ఈ మధ్య కాలంలో తరచూ కామెంట్లు వినిపిస్తున్నాయి. శృంగారం, వయోలెన్స్, బూతులు వంటివి పిల్లలను ప్రభావితం చేస్తున్నాయి… వారిని తప్పుదోవ పట్టిస్తున్నాయి అంటూ చాలా మంది మీడియా, సోషల్ మీడియా ముఖంగా చెప్పుకొస్తున్నారు. దీంతో ఓటీటీ కంటెంట్ ను సెన్సార్ చేసేందుకు యూకే ప్రభుత్వం ముసాయిదాను సిద్ధం చేసింది. దీనికి కనుక అప్రూవల్ వస్తే.. నెట్ ఫ్లిక్స్, డిస్నీ + హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలకు పెద్ద షాక్ తగిలినట్టే అని చెప్పాలి.

మొన్నటికి మొన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఓటీటీ కంటెంట్ పై సీరియస్ అయ్యారు. ‘స్వేచ్ఛ అనేది కేవలం క్రియేటివిటీకి మాత్రమే.. అశ్లీలతకు కాదు. హద్దులు మీరితే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఓటీటీ కంటెంట్ పర్యవేక్షణ, నిబంధనల్లో మార్పుల గురించి ఐటీశాఖ పరిశీలిస్తుందని’ ఆయన అన్నారు.’మరోపక్క ప్రభుత్వం అమలు చేసిన నిబంధనలు ఉల్లంఘిస్తే.. రూ.2 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని’ కూడా ఆయన హెచ్చరించారు.

ఈ మధ్యనే ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఇందులో బూతులు, అడల్ట్ కంటెంట్ ఎక్కువగానే దట్టించారు. ఇందులో వెంకటేష్, రానా వంటి టాలీవుడ్ క్రేజీ హీరోలు నటించడం వల్లనే… ఆ సిరీస్ ను ఎక్కువ మంది చూశారు. అందుకే ఈ రచ్చ మొదలైంది. అయితే సెన్సార్ చేసినంత మాత్రాన మారేది ఏముంటుంది.

పోర్న్ వెబ్ సైట్స్ ను చూసే జనాల సంఖ్య ఎక్కువగానే ఉంది. వాళ్లకు ఓటీటీ (OTT) కాకపోతే ఆ ఆప్షన్ ఉంటుంది. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే ఇంతకు మించిన డెసిషన్ ఏమైనా తీసుకుంటే మంచిదని అంతా అంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus