Kollywood: సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడయోల్లో కోలీవుడ్‌ కేకబ్బా.. మనమెప్పుడో?

గత మూడు రోజులుగా కోలీవుడ్‌లో.. గత రెండు రోజులుగా టాలీవుడ్‌లో వినిపిస్తున్న డైలాగ్‌ ‘మొగుడిగా ఉండడం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడిలా ఉండడం ముఖ్యం’. విశాల్‌ – తమన్నా – సుందర్‌.సి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పురుషన్‌’ / ‘మొగుడు’ సినిమాలోని డైలాగ్‌ ఇది. ఈ డైలాగ్‌తోనే కొత్త సినిమాను అనౌన్స్‌ చేశారు విశాల్‌ – సుందర్‌. ఆ డైలాగ్‌ గురించి ఎంతలా మాట్లాడుకుంటున్నారో.. ఆ వీడియో గురించి కూడా అంతలా మాట్లాడుకుంటున్నారు.

Kollywood

సుమారు ఐదు నిమిషాల నిడివి ఉన్న ఆ సినిమా టైటిల్‌ ప్రోమో భలేగా ఉంది. సినిమా కాన్సెప్ట్‌ భలేగా అర్థమయ్యేలా చెప్పారు. నిజానికి కోలీవుడ్‌ నుండి ఇలాంటి వీడియోలు రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటివి చేశారు. అలరించారు కూడా. ఇప్పుడున్న ప్రశ్న వాళ్లు చేయగలుగుతున్న ఈ కాన్సెప్ట్‌ మన దగ్గర ఇప్పటివరకు రాలేదేంటి అని. కావాలంటే మీరే చూడండి తమిళ సినిమా పరిశ్రమలో ఇలాంటి వీడియోలు తరచుగా వస్తున్నాయి. తెలుగులో అయితే రావడం లేదు.

ఆ మధ్య వచ్చిన ‘జైలర్‌’, ‘జైలర్‌ 2’ సినిమాలకు దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఇలాంటి వీడియోలు చేసి సినిమా మీద బాగా హైప్‌ పెంచారు. అనుకున్నట్లుగానే తొలి సినిమా విషయంలో సక్సెస్‌ సాధించారు. ఇక అల్లు అర్జున్‌ సినిమాకు అట్లీ, మొన్నీమధ్య లోకేశ్ కనగరాజ్‌ కూడా ఇలాంటి కాన్సెప్ట్ వీడియోలను సిద్ధం చేసి రిలీజ్‌ చేశారు. అందులో సినిమా కథ గురించి కాస్త చెప్పే ప్రయత్నం చేసి టీజర్‌ చేశారు కూడా. ఇవి సినిమా గురించి మరింతగా చర్చించుకునేలా చేస్తాయి. తమిళనాట అయితే కొన్ని పాటల విడుదలకు ముందు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు.

తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్‌లు ఆలోచించగల, చేయగల దర్శకులు, చేసే ప్రమోషనల్‌ టీమ్స్‌ చాలానే ఉన్నాయి. సినిమా విడుదలకు ముందు చేస్తున్నారు తప్ప అనౌన్స్‌మెంట్‌కి చేయడం లేదు. మరి ఇలాంటి పనులు ఎప్పుడు చేసి కోలీవుడ్‌కి సమానంగా మనమూ ఇలాంటివి చేయగలం అని నిరూపిస్తారో చూడాలి.

‘మన శంకర వరప్రసాద్ గారు’ పై పవన్ కళ్యాణ్ రివ్యూ

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus