టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా వస్తుసేవల పన్ను(జీఎస్టీ) విభాగం షాకిచ్చింది. మహేష్ బాబు కార్యాలయం పై ఈరోజు దాడులు నిర్వహించారు. వివిధ యాడ్స్ ద్వారా మహేష్ బాబు సంపాదిస్తున్న ఆదాయానికి సరిగ్గా సర్వీస్ టాక్స్ చెల్లించకపోవడంతో ఆయన బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది.
2007-2008 ఏడాదిలో వివిధ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. అయితే ఆ యాడ్స్ రూపంలో మహేష్ కి వచ్చిన ఆదాయానికి ఐటీ విభాగానికి రూ.18.5 లక్షలు బకాయిలు చెల్లించలేదంట. దాదాపు రూ.73 లక్షలు టాక్స్ చెల్లించలేదని స్పష్టమవుతుంది. కాగా ఈరోజు మహేష్ బాబు ఆఫీస్ లో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందుకుగాను మహేష్ బాబు యాక్సిస్ బ్యాంక్ లో ఉన్న రూ.43 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకో 30.5 లక్షలను వసూలు చేయాల్సి ఉండగా.. ఆ అమౌంట్ కోసం మహేష్ బాబుకి నోటీసులు పంపారట. సూపర్ స్టార్ మహేష్ బాబు 2005 నుండీ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నాడు. ఇంకా చాలా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే యాడ్స్ ద్వారా సంపాదించిన ఆదాయానికి సర్వీస్ ట్యాక్స్ చెల్లించకపోవడం గమనించ దగ్గ విషయం.