అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం నుంచి గుచ్చే గులాబీ సాంగ్ టీజ‌ర్ విడుద‌ల‌!

  • February 11, 2021 / 05:09 PM IST

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజ‌ర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఈ నేప‌థ్యంలో ప్రేమికుల రోజు కానుకా సెన్సేష‌న్ మ్యూజిక్ డైరక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ట్యూన్ చేసిన గుచ్చే గులాబీలాగా అంటూ సాగే ఓ రొమాంటిక్ సాంగ్ ను విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు మొద‌లుపెట్టారు. అందులో భాగంగా అఖిల్ అక్కినేని ఈ పాట‌ను ఓ టీజర్ ద్వారా ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ నుంచి ఓ టీజ‌ర్ ని విడుద‌ల చేసి అభిమానుల్లో మ‌రింత ఉత్కంఠ పెంచారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇదే రీతిన‌ ఫిబ్ర‌వ‌రి 13న విడుద‌ల అవ్వ‌బోతున్న ఫుల్ సాంగ్ కూడా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెలిపారు. జూన్ 19న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల అవ్వ‌నుంది.


వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus