ఆ విషయంలో ఖుషి మేకర్స్ జాగ్రత్త పడాల్సిందేనా.. ఏం జరిగిందంటే?

విజయ్ దేవరకొండ గత సినిమా లైగర్, సమంత గత సినిమా శాకుంతలం, శివ నిర్వాణ గత సినిమా టక్ జగదీష్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలలో టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ కావడంతో నిర్మాతలకు నష్టం తప్పినా మిగతా రెండు సినిమాలు మాత్రం నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణలకు ఖుషి సినిమాతో సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు.

నిన్ను కోరి, మజిలీ సినిమాలతో విజయాలను అందుకున్న ఈ దర్శకుడు తన రూట్ లో ఈ సినిమాను తెరకెక్కించడంతో ఖుషి మూవీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే సెప్టెంబర్ 1వ తేదీన ఖుషి మూవీ విడుదలవుతుండగా సెప్టెంబర్ 2వ తేదీన పవన్ పుట్టినరోజు కానుకగా గుడుంబా శంకర్ మూవీ విడుదలవుతోంది. గుడుంబా శంకర్ మూవీ రీ రిలీజ్ తో ఖుషి మూవీకి ఒకింత ఇబ్బందేనని చెప్పవచ్చు.

గుడుంబా శంకర్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్ అనే రేంజ్ లో ఉన్నాయి. గుడుంబా శంకర్ బుకింగ్స్ పూర్తిస్థాయిలో ఓపెన్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద పవన్ విధ్వంసం మామూలుగా ఉండదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఖుషి మూవీకి పాజిటివ్ టాక్ వస్తే సమస్య లేదు కానీ టాక్ ఆశించిన స్థాయిలో లేకపోతే మాత్రం ఇబ్బందేనని చెప్పవచ్చు.

ఖుషి మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం మరింత పెంచితే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సమంత వేర్వేరు కారణాల వల్ల ప్రమోషన్స్ కు దూరంగా ఉన్న నేపథ్యంలో సినిమాపై అంచనాలను పెంచే బాధ్యతను చిత్రయూనిట్ తీసుకోవాల్సి ఉంది. ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయం సాధిస్తుందని ఫ్యాన్ఫ్ ఫీలవుతుండగా ఈ సినిమాకు నిజంగానే ఆ రేంజ్ లో టాక్ వస్తుందేమో చూడాలి. ఖుషి సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరగడం గమనార్హం.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus