గల్లీ క్రికెట్ నేపథ్యం లో ‘పరాక్రమం’

గల్లీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘పరాక్రమం’ చిత్రం 2024 సమ్మర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది.. గతం లో డిజిటల్ లో విడుదల అయిన ‘మాంగల్యం’ చిత్రం బండి సరోజ్ కుమార్ కి మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇప్పుడు పరాక్రమం చిత్రం గల్లీ క్రికెట్ నేపథ్యంలో ఉంటుంది. సినిమా అభిమానులకి, క్రికెట్ అభిమానులకు మరియు బండి సరోజ్ కుమార్ ఫాన్స్ కి ఈ చిత్రం అలరించబోతోంది.

బండి సరోజ్ కుమార్ పరాక్రమం చిత్రంలో హీరో గా నటించడమే కాకుండా దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్, రచన, పాటలు మరియు నిర్మాతగా కూడా వ్యవహరించారు. గతంలో తన మూడు సినిమాలు డిజిటల్ లో ‘వాచ్ అండ్ పే’ (డబ్బు కట్టి సినిమా చూసే పద్ధతి) ద్వారా విడుదల చేసి, విజయం సాధించారు, ఇప్పుడు ఈ పరాక్రమం చిత్రాన్ని థియేటర్ లో తన సొంత బ్యానర్ బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ (BSK Mainstream) ద్వారా విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రం లో శాస్త్రీయ నృత్య కళాకారిణి శృతి సమన్వి మరియు నాగ లక్ష్మి హీరోయిన్లుగా నటించారు. మరో 50 మంది నూతన నటి నటులు పరిచయం కాబోతున్నారు. వీళ్లలో చాలామంది థియేటర్ ఆర్టిస్ట్ లు

పౌర్ణమి, 100% లవ్ లాంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ గా పనిచేసిన వెంకట్ ఆర్ ప్రసాద్ పరాక్రమం చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే కాళీ ఎస్ ఆర్ అశోక్ సౌండ్ డిజైన్ చేస్తున్నారు. షూటింగ్ అంత పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. త్వరలో సినిమా టీజర్ విడుదల చేసి రిలీజ్ డేట్ వివరాలు తెలియజేస్తారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus