Guntur Kaaram: ‘గుంటూరు కారం’ సినిమా… ఆ నవల ఆధారంగానే తీశారా?

  • January 8, 2024 / 01:57 PM IST

ఎన్నో రోజులుగా వెయిట్‌ చేస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా ట్రైలర్‌ వచ్చేసింది. అభిమానులు అదిరిపోయేలా నచ్చడంతో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. అయితే నచ్చని నెటిజన్లు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఆ విషయం ఎప్పుడూ జరిగేదే కానీ… త్రివిక్రమ్‌ గత చరిత్ర తెలిసిన కొంతమంది సాహితీ ప్రియులు మాత్రం ఈ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే ఓ నవలలోని కథను పోలినట్లుగా ఉంది అని అంచనా వేస్తున్నారు. దీంతో ఆ నవల పేరు కూడా వైరల్‌ అవుతోంది. అదే ‘కీర్తి కిరీటాలు’.

సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు ప్రకారం చూస్తే… దర్శకుడు త్రివిక్రమ్‌కి అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి రాసిన నవల ‘కీర్తి కిరీటాలు’కు ఈ సినిమాకు దగ్గర పోలిక ఉంది అంటున్నారు. ఆమె నవలలు అంటే త్రివిక్రమ్‌కు విపరీతమైన అభిమానం. ఆమె రచనాశైలిని గురూజీ బాగా ఇష్టపడుతారు. ఆమె రాసిన ‘మీనా’ అనే నవల ఆధారంగానే సమంత – నితిన్‌ల ‘అ ఆ’ సినిమా తీశారనే విషయం తెలిసిందే. ఇప్పుడు ‘గుంటూరు కారం’ సినిమా కూడా అలానే ‘కీర్తికిరీటాలు’ అనే నవల ఆధారంగా తెరకెక్కించి ఉంటారు అంటూ ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు.

ఎందుకంటే సినిమా ట్రైలర్‌లో సన్నివేశాలు, డైలాగ్‌లు అచ్చంగా అలానే ఉన్నాయి అని అంటున్నారు. ‘కీర్తి కిరీటాలు’ నవల సంగతి చూస్తే… సంగీత ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకున్న రాజ్యలక్ష్మి కొన్నేళ్లు అమెరికాలో ఉండి వస్తుంది. హైదరాబాద్‌లో తన పెంపుడు కొడుకు కిషోర్ జీవనం సాగిస్తుంటారు. ఓ రోజు తన డ్రైవర్ కి ఒక లెటర్ ఇచ్చి విజయవాడ సమీపంలోని విద్యాపురం అనే ఊరిలో ఉన్న ఓ కుర్రాడికి ఇవ్వమని చెబుతారు. ఆ డ్రైవర్ లెటర్‌ తీసుకుని ఊరికి వెళ్తుండగా నవలలో కథ మొదలవుతుంది.

తన కొడుకుని చూడాలనేది ఆమె ఆరాటం. ఆమె స్నేహితురాలి కూతురు స్వర్ణతో తేజకి పెళ్లి చేయించి తన ఆస్తిని ఇచ్చి తన తప్పుని సరిచేసుకోవాలని అనుకుంటుంది. తేజ ఆమెను చూడటానికి వస్తాడా? అనేది ఆ నవల కథ. ఫ్లాష్‌ బ్యాక్‌లో రాజ్యలక్ష్మి తన కొడుకు తేజని ఎనిమిదో యేటే వదిలేసి విదేశాలకు వెళ్లిపోతుంది. దీంతో ఆ బాబు తాతయ్య దగ్గరే పెరుగుతాడు. ఎందుకు వెళ్లిపోయింది, దాని వెనుక కథేంటి అనేది నవల.

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ట్రైలర్‌ చూపించిన సన్నివేశాలు, మాటలు ఆ నవలకు దగ్గరగా ఉన్నాయి అంటున్నారు. ఆ నవలను ఆధారంగా తీసుకొని ఒక స్టార్‌ హీరో కావాల్సిన ఎలిమెంట్స్‌ జోడించి త్రివిక్రమ్‌ ఈ సినిమా చేశారంటున్నారు. దీనిపై టీమ్‌ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. లేదంటే 12వ తేదీన టైటిల్‌ కార్డ్స్‌లో చూడాల్సిందే.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus