Guntur Kaaram Trailer: ‘గుంటూరు కారం’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో ‘అతడు’ ‘ఖలేజా’ వంటి క్రేజీ సినిమాల తర్వాత ఇంకో సినిమా వస్తుంది అంటే సహజంగానే అంచనాలు భారీగా ఏర్పడతాయి. ‘గుంటూరు కారం’ పై కూడా అదే విధంగా అంచనాలు ఏర్పడ్డాయి. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జనవరి 12 న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ‘గుంటూరు కారం’ గ్లింప్స్, ‘దమ్ మసాలా’ ‘ఓ మై బేబీ’ ‘కుర్చీని మడతపెట్టి’ వంటి పాటలు అంచనాలను మ్యాచ్ చేయలేకపోయాయి అనే చెప్పాలి.

దీంతో ట్రైలర్ పైనే ఆశలు పెట్టుకున్నారు మహేష్ అభిమానులు. ఈరోజు సుదర్శన్ థియేటర్లో అభిమానుల మధ్య ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో కూడా  రిలీజ్ అయ్యింది.  2 నిమిషాల 47 సెకన్ల నిడివి కలిగిన ఈ సినిమా ట్రైలర్ కంప్లీట్ గా మహేష్ బాబు క్యారెక్టర్ ను , బాడీ లాంగ్వేజ్ నే హైలెట్ చేసే విధంగా ఉంది అని చెప్పాలి. మహేష్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ శ్రీలీల , మీనాక్షి చౌదరి.. ల గ్లామర్ కూడా హైలెట్ అయ్యింది.

యాక్షన్,  ఎమోషన్స్ , మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ ట్రైలర్ లో పుష్కలంగా ఉన్నాయి. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ మహేష్ చెబుతుంటే అందరికీ ఖలేజా రోజులు గుర్తుకు వస్తాయి. ఇక కథలో పొలిటికల్ టచ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తమన్ నేపధ్య సంగీతం మాత్రం ట్రైలర్ కి మైనస్ గా ఉంది అనిపించింది. ఇక ట్రైలర్ ను మీరు కూడా చూడండి:

 

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus