Gurthunda Seethakalam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘గుర్తుందా శీతాకాలం’ ..!

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, స్టార్ హీరోయిన్ తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘గుర్తుందా శీతాకాలం’. ప్రియదర్శి, సుహాసిని కూడా ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషించారు. షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్నప్పటికీ.. రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు నిన్న అంటే డిసెంబర్ 9న రిలీజ్ అయ్యింది. నాగ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి బ్యానర్లపై రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్ లు కలిసి నిర్మించారు.

గాడ్ ఫాదర్ చిత్రానికి డైలాగ్స్ రాసిన లక్ష్మీ భూపాల్ ఈ చిత్రానికి కూడా డైలాగ్స్ అందించగా కాలభైరవ సంగీతం అందించాడు.తొలిరోజు ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చింది. కానీ రెండో రోజు నుండే థియేటర్లలో జనాలు ఖాళీ అయిపోయారు. 5 రోజులకే ఈ మూవీ ఫుల్ రన్ ముగిసినట్టు అయ్యింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.15 cr
సీడెడ్ 0.09 cr
ఏపీ 0.13 cr
ఏపీ + తెలంగాణ(టోటల్ 0.37 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.02 cr
వరల్డ్ వైడ్ టోటల్ 0.39 cr

‘గుర్తుందా శీతాకాలం’ చిత్రానికి రూ.1.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.కానీ ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.0.39 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే బయ్యర్స్ రూ.1.61 కోట్లు నష్టపోయారన్న మాట. దీంతో ఈ మూవీ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus