బ్రహ్మానందానికి ‘గురుశ్రీ’ పురస్కారం

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన హాస్యంతో సూపర్ స్టార్ గా మారిన కమెడియన్ ఎవరంటే అందరు చెప్పే పేరు .. బ్రహ్మానందం. ఇప్పటికే వెయ్యికి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించి గిన్నిస్ బుక్ లో స్తానం సంపాదించుకున్న ఆయనకు శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ”గురు శ్రీ” పురస్కారంతో సన్మానించింది. ఈ సందర్బంగా ఆయనకు బంగారు కంకణాన్ని తొడిగారు. గత 20 ఏళ్లుగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కృష్ణాష్టమి సందర్బంగా చెన్నై లోని మ్యూజిక్ అకాడమీ లో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధా ప్రసాద్, ప్రముఖ గాయని పి సుశీల, సుజయ్ కృష్ణ రంగారావు, శ్రీమతి విజయ రాజాం, బెల్లంకొండ కృష్ణ మూర్తి, శ్రీ కళాసుధ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువు ప్రముఖులను సన్మానించారు. ఈ సందర్బంగా బ్రహ్మానందం మాట్లాడుతూ .. నిజంగా ఈ కృష్ణాష్టమి రోజున గురుశ్రీ పురస్కారంతో నన్ను అభినందించడం ఆనందంగా ఉంది. నేను ఈ స్థాయికి రావడానికి కారణం అయిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులను నవ్వించేందుకే దేవుడు నన్ను పంపించాడు. అందుకే నేను మిమ్మల్ని నవ్విస్తున్నాను. మీ ఆదరాభిమానాలు ఉన్నంత వరకు మిమ్మల్ని నవ్వించే పనిలోనే ఉంటాను. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం. ఇలా ప్రముఖులను అభినందించడం గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని ఇన్నాళ్ళుగా ఒకే ఒక్కడు పట్టు విడవకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి బేతిరెడ్డి శ్రీనివాస్. అయన పట్టుదల చుస్తే ముచ్చటేస్తుంది. ఇలా ఒక్కడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. కృష్ణాష్టమి సందర్బంగా ఈ రోజు నాకు గురు శ్రీ గౌరవాన్ని ఇవ్వడడం భగవత్ సంకల్పపంగా భావిస్తున్నాను అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus