గువ్వ గోరింక సినిమా రివ్యూ & రేటింగ్!

  • December 18, 2020 / 08:50 AM IST

సత్యదేవ్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలో నటించిన చిత్రం “గువ్వ గోరింక”. దాదాపు నాలుగేళ్లుగా కారణాంతరాల వలన ల్యాబ్ లో నలుగుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మరి ఈ లవ్ స్టోరీ ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో చూద్దాం.

కథ: మెకానికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్.డి చేయడం కోసం సౌండ్ రాని ఇంజన్ ను కనుక్కోవడం అతని ధ్యేయం. ఆ ధ్యేయం వెనుక ఉన్న మరో రీజన్ అతడికి సౌండ్ అంటే పడకపోవడమే. ఇక తండ్రికి ఇష్టం లేకపోయినా మ్యూజిక్ కోర్స్ చేయడం కోసం హైద్రాబాద్ వస్తుంది శిరీష (ప్రియా లాల్). సంగీతంలో తన తల్లి సాధించలేకపోయిన స్థానాన్ని తాను సాధించాలనుకుంటుంది. ఈ ఇద్దరు ఒకే ఫ్లాట్ లో ఉండాల్సి వస్తుంది. కానీ.. ఒకరికి ఒకరు మాత్రం కనిపించరు. కొన్ని రోజులకు మాటలతో ప్రేమించుకుంటారు, ఒకర్నొకరు చూసుకోకుండానే అర్ధం చేసుకొంటారు. కనీసం పేర్లు కూడా తెలుసుకోరు. వారి లవ్ స్టోరీ ఎలా సాగింది? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: సత్యదేవ్ సహజంగా నటించాడు. తెలంగాణ యాస ప్రయత్నించడం బానే ఉంది కానీ.. కంటిన్యుటీ మిస్ అయ్యింది. శిరీష పాత్రలో ప్రియా లాల్ కళ్ళతోనే హావభావాలు చక్కగా పలికించింది. మంచి తెలుగమ్మాయిలా ఉంది ప్రియా. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు చక్కని కామెడీతో ఆకట్టుకున్నారు. ఎప్పుడు ఫైటర్స్ బ్యాచ్ లో కమిడియన్ గా కనిపించే ఫిష్ వెంకట్ ఈ చిత్రంలో సత్యదేవ్ తండ్రిగా ఆకట్టుకున్నాడు.

సాంకేతికవర్గం పనితీరు: ఒక సాధారణ కథను అసాధారణంగా ప్రెజంట్ చేయడం అనేది మాములు విషయం కాదు. ఇందులో దాదాపుగా సక్సెస్ అయ్యాడు దర్శకుడు మోహన్. ఎప్పుడో “ప్రేమలేఖ” తర్వాత ఇద్దరు వ్యక్తులు ఒకర్నొకరు చూసుకోకుండా ప్రేమించుకొనే కథలు చాల అరుదుగా వచ్చాయి. “ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు”లో ఒకే ఇంట్లో ఒకరికి తెలియకుండా ఒకరు ఉంటూ ప్రేమించుకొని కాన్సెప్ట్ ఆధారంగానే ఈ సినిమా కూడా ఉంటుంది. అయితే.. ప్రేమను ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపడా ఎమోషన్ లేకుండాపోయింది. అందువల్ల మంచి ప్రయత్నానికి సరైన ఫలితం దక్కలేదనే చెప్పాలి.

సురేష్ బొబ్బిలి సంగీతం, మైలేషన్ రంగస్వామి ఛాయాగ్రహణం బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అయితే.. 4 ఏళ్ల క్రితం సినిమా కావడంతో ఆర్ట్ వర్క్ మాత్రం సోసోగా ఉంది.

విశ్లేషణ: మరీ ఎక్కువ బోర్ కొట్టదు కానీ.. ఓవరాల్ గా పర్వాలేదనిపించే సినిమా “గువ్వ గోరింక”. సత్యదేవ్ నటన, సురేష్ బొబ్బిలి సంగీతం ఈ చిత్రానికి ప్రధానాకర్షణలు. రిపీటెడ్ సీన్స్ & ఫ్లాట్ స్క్రీన్ ప్లేను ఫార్వార్డ్ చేయగలిగితే సరదాగా ఒకసారి చూడదగ్గ చిత్రమిది.

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus