హంసానందిని సాహసాలు ఈ వీడియో లో చుడండి!!

‘బావ‌గారూ బాగున్నారా’ సినిమాను త‌లుచుకోగానే ఆ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి చేసిన బంగీ జంప్ సీన్ గుర్తుకొచ్చేస్తుంది. అప్ప‌ట్లో చిరు చేసిన డేరింగ్ ఫీట్ పెద్ద సంచ‌ల‌నం. ఆయ‌న చేసిన సాహ‌సానికి మంచి ప్రచారం ల‌భించింది. చిరు చేసిన ఫీట్ ఓ మైల్ స్టోన్ లాగా నిలిచిపోయింది టాలీవుడ్లో. ఐతే ఇప్పుడు ఇదే సాహ‌సాన్ని ఓ హీరోయిన్ చేయ‌డం విశేషం. ఆ హీరోయిన్ మ‌రెవ్వ‌రో కాదు.. ఐటెం సాంగ్ స్పెష‌లిస్ట్ హంసా నందిని.

తాజాగా ఈ నటి ఓ అడ్వెంచ‌ర‌స్ టూర్ కోసం న్యూజిలాండ్ కు వెళ్లింది. ఇందులో భాగంగా బంగీ జంప్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. వేల అడుగుల ఎత్తు నుంచి న‌డుముకు తాడు క‌ట్టుకుని లోయ‌లాంటి కిందికి దూకేయ‌డ‌మే ఈ బంగీ జంప్‌.ర‌క్ష‌ణ ఏర్పాట్ల‌న్నీ ప‌క్కాగా ఉన్న‌ప్ప‌టికీ ధైర్యంగా అంతెత్తు నుంచి దూకేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. అందులోనూ ఓ అమ్మాయి ఇలా చేయ‌డం గొప్ప విష‌య‌మే. కేవ‌లం బంగీ జంప్ మాత్ర‌మే కాదు.. స్కై డైవింగ్, క‌యాకింగ్ స‌హా ఈ టూర్లో అనేక సాహ‌సాలు చేసింది హంసా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus