Hansika, Sreeleela: ఇప్పటి హీరోయిన్స్ దేనికైనా రెడీ అంటున్నారు!

  • November 17, 2023 / 08:06 PM IST

హీరోయిన్ ఇండస్ట్రీలో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఒకానొక సమయంలో వరుసగా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఇకపోతే పెళ్లి తర్వాత కూడా హన్సిక ఇండస్ట్రీకి దూరం కాకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నటువంటి హన్సిక నేడు మై నేమ్ ఇస్ శృతి అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు.

ఈ సినిమా నేడు విడుదల ఆయన సందర్భంగా ఈమె పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హన్సికకు విలేకరుల నుంచి వివిధ రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. సందర్భంగా ఈమెను ప్రశ్నిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి హీరోయిన్లలో మీకు ఎవరు ఇష్టం అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు హన్సిక ఏ మాత్రం ఆలోచించకుండా శ్రీ లీల అంటూ సమాధానం చెప్పారు. శ్రీ లీలా (Sreeleela) చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఎంతో అద్భుతంగా నటిస్తుంది.

తన వర్క్ నాకు చాలా బాగా నచ్చింది అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి నటిమనులను చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందనే కృష్ణ ఎదురైంది. ఈ ప్రశ్నకు కూడా ఈమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. నటన విషయంలో ప్రస్తుతం ఓల్డ్ యంగ్ అని భేదాలు తాను చూడనని ఈమె తెలియజేశారు.వయసు గురించి కాకపోయినా అనుభవం విషయంలో అయినా రోజులు మారాయని, ఎవరి అనుభవం వారికి ఉంటుందని చెప్పుకొచ్చింది.

8 ఏళ్ల వయసులో నేనొక పని చేసేదాన్ని 15 ఏళ్ళు వచ్చాక హీరోయిన్గా మారిపోయాను కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంటుందని తెలిపారు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి హీరోయిన్స్ ఏదైనా నేర్చుకొని ఎలాంటి సన్నివేశాలలో అయిన నటించడానికి వెనకాడడం లేదు అంటూ ఈ సందర్భంగా హన్సిక సమాధానం చెప్పారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus