Hanu Man 3D: హనుమాన్ త్రీడీ వెర్షన్ ప్లాన్ అదుర్స్.. మరిన్ని రికార్డులు సొంతమవుతాయా?

తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం కొనసాగిస్తోంది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సత్తా చాటుతోంది. ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే హనుమాన్ మూవీ త్రీడీ వెర్షన్ లో రీరిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని త్వరలో త్రీడీ వెర్షన్ గురించి క్లారిటీ రానుందని తెలుస్తోంది. హనుమాన్ త్రీడీ వెర్షన్ ప్లాన్ అదుర్స్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రీరిలీజ్ లో ఈ సినిమా మరికొన్ని రికార్డులు సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హనుమాన్ త్రీడీ వెర్షన్ రిలీజైతే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో మరిన్ని సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంటుంది. హనుమాన్ త్రీడీ వెర్షన్ లో కొత్త సీన్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. తేజ సజ్జా ప్రశాంత్ వర్మ ఇతర భాషల్లో సైతం హనుమాన్ తో మరింత సత్తా చాటడంతో పాటు మరిన్ని సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని తెలుస్తోంది.

ప్రశాంత్ వర్మకు హనుమాన్ సక్సెస్ తో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. ఈ దర్శకుడి డైరెక్షన్ లో నటించడానికి స్టార్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉంది. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నిర్మాతలు ప్రశాంత్ వర్మకు భారీ మొత్తంలో అడ్వాన్స్ లు ఇవ్వడానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది.

హనుమాన్ (Hanu Man) మూవీ 100 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలను అందించిన నేపథ్యంలో జై హనుమాన్ మూవీ సైతం అంతకు మించి లాభాలను అందిస్తుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జై హనుమాన్ లో టాలీవుడ్ స్టార్స్ నటించే ఛాన్స్ ఉండటంతో ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus