Hanu Man OTT: బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హనుమాన్ ఓటీటీ డీల్ లో మార్పులు జరిగాయా?

తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ ఇప్పటివరకు 260 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై రెండు వారాలు దాటినా ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. ఫుల్ రన్ లో ఈ సినిమా కలెక్షన్లు 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లకు అటూఇటుగా ఉండే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. అయితే హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమా ఓటీటీ లెక్కలు మారాయని తెలుస్తోంది.

తాజాగా ఓటీటీ డీల్ లో చేసిన మార్పుల ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ నుంచి ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమింగ్ కానుంది. హనుమాన్ ఓటీటీ వెర్షన్ కోసం అప్పటివరకు ఎదురుచూపులు తప్పవని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతూ ఉండటం గమనార్హం. హనుమాన్ సినిమాతో మరోసారి కంటెంట్ అద్భుతంగా ఉంటే సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని ప్రూవ్ అయింది.

హనుమాన్ (Hanu Man) సినిమా క్రియేట్ చేసిన సంచలన రికార్డులు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. హనుమాన్ చిన్న సినిమాలలో పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రశాంత్ వర్మ ఇమేజ్ ను మార్చేసింది. ప్రశాంత్ వర్మ వేగంగా సినిమాలను తెరకెక్కించడానికి ప్రాధాన్యత ఇస్తుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి స్వల్పంగా మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

కొత్తతరం దర్శకులు సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నారు. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తో సంచలనాలు సృష్టిస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జై హనుమాన్ సినిమాలో బాలీవుడ్ హీరో నటిస్తారని హనుమంతుని పాత్రలో బాలీవుడ్ స్టార్ కనిపిస్తారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus