‘హనుమాన్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. రూ.40 కోట్ల బడ్జెట్ లో తీసిన పాన్ ఇండియా సినిమా ఇది అని చిత్ర బృందం మొదటి నుండి చెబుతూనే ఉంది. ఆ రకంగా చూసుకుంటే ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ప్రకారం రూ.100 కోట్ల పైనే లాభాలు అందుకుంది అని చెప్పాలి.
నిర్మాత నిరంజన్ రెడ్డికి మాత్రమే కాకుండా దర్శకుడు ప్రశాంత్ వర్మకి కూడా లాభాల్లో వాటాలు ఉన్నాయి. మూడున్నరేళ్లు పడిన కష్టం ప్రశాంత్ వర్మని.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేర్చింది. ఇప్పుడు అతనికి బాలీవుడ్ నుండి కూడా బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న ప్రశాంత్ వర్మ… పనిలో పనిగా ఓ కాస్ట్ లీ కారుని కొనుగోలు చేసే పనిలో పడ్డాడు.
రేంజ్ రోవర్ హై ఎండ్ వెర్షన్ గల కొత్త కారుని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) బుక్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ యంగ్ స్టార్ పాన్ ఇండియా డైరెక్టర్ బెంజ్ కారు వాడుతున్నాడు. ఇక నుండి రేంజ్ రోవర్లో తిరుగుతాడు అన్నమాట. సక్సెస్ కొడితే.. లాభాలు.. లగ్జరీలు.. అవే వెతుక్కుంటూ వస్తాయి అని ప్రశాంత్ వర్మ ప్రూవ్ చేశాడు. మరోపక్క ఇక ఇతని ‘జై హనుమాన్’ ప్రాజెక్టు పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!