Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 9, 2026 / 05:02 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • శోభినవ్ సత్య (Hero)
  • పూర్ణిమ తివారి (Heroine)
  • మాస్టర్ విహాన్, చందన్ ఆనంద్, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే తదితరులు (Cast)
  • విశాల్ చతుర్వేది (Director)
  • రాగిని ఎస్, నమ్రత జి సింగ్, అనుప్రియా ఎ నగర్, విశాల్ చతుర్వేది (Producer)
  • సాధు తివారి, రిషి పతక్ (Music)
  • విశాల్ బవ (Cinematography)
  • షాంక్ రాజ్యద్యక్షా (Editor)
  • Release Date : 9th అక్టోబ‌ర్‌ 2026
  • స్వంభు మీడియా నెట్ వర్క్ (Banner)

బాలీవుడ్‌లో చిన్న సినిమాగా రిలీజై రికార్డులు క్రియేట్ చేసింది హ‌నుమాన్ అంశ్‌. ఈ మైథాల‌జీ మూవీని మొద‌ట ఆడియెన్స్ పెద్ద‌గా పట్టించుకోలేదు. మౌత్ టాక్‌తో మెళ్ల‌మెళ్ల‌గా వ‌సూళ్లు పెరిగాయి. సెన్సేష‌న‌ల్ హిట్‌గా నిలిచింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.400 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఈ రికార్డ్ క‌లెక్ష‌న్స్ కార‌ణంగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇక్కడి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఒక దశలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ హ‌నుమాన్ అంశ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. కానీ తర్వాత ఆయన తప్పుకోవడం, హోంబలే సంస్థ మైత్రి మూవీ శశి ద్వారా అక్టోబర్ 9న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా అంటే?

Hanuman Ansh Movie Review

Hanuman Ansh Movie Review And Rating

కథ: 1905లో అక్బర్‌పూర్‌ అనే గ్రామంలో జన్మించిన లక్ష్మీనారాయణ శర్మ (శోభినవ్ సత్య) జీవిత ప్రయాణమే ఈ సినిమా క‌థ‌. చిన్నతనంలోనే కన్నతల్లిని కోల్పోయిన శర్మ తీవ్రమైన మానసిక వేదనకు గురవుతాడు. అతన్ని ఓదార్చడానికి తండ్రి, బంధువులు, గ్రామస్తులంతా ‘నీ తల్లి శ్రీరాముని వద్దకు చేరుకుంది’ అని చెబుతారు. ఆ మాటలు అతని మనసులో బలంగా నాటుకుపోతాయి. తన తల్లిని కలుసుకోవాలంటే తాను కూడా శ్రీరాముని చెంతకు చేరుకోవాలని నిశ్చయించుకుంటాడు.

ఆ భక్తి భావంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని, అనునిత్యం శ్రీరామ ధ్యానంలోనే గడపడం ప్రారంభిస్తాడు. భగవంతుని అన్వేషణలో కుటుంబాన్ని వదులుకోవడానికి సైతం వెనుకాడడు. వివాహం జరిగినప్పటికీ, సంసారిక జీవితం కంటే తన ఆధ్యాత్మిక ప్రయాణానికే అధిక ప్రాధాన్యత ఇస్తాడు.

శ్రీరాముడి కోసం తపించిన అతని ప్రయాణంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఒక సామాన్య బాలుడైన లక్ష్మీనారాయణ శర్మ, అసామాన్యమైన ‘నీమ్ కరోలి బాబా’గా ఎలా అవతరించారు? తన నిస్వార్థ ప్రేమతో, మహిమలతో సమాజానికి ఆయన ఎలాంటి సేవలు అందించారు? అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

Hanuman Ansh Movie Review And Rating

నటీనటుల పనితీరు: నీమ్ కరోలి బాబాగా శోభినవ్ సత్య ఒదిగిపోయారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత మెయిన్ లీడ్‌కు ఎంపిక‌య్యారు. న‌టుడిగా తొలి సినిమానే అయినా స‌హ‌జ న‌ట‌న‌తో క‌రోలా బాబా పాత్ర‌కు ప్రాణం పోశారు. నిజంగానే ఆయన్ని చూస్తే సాక్షాత్తు భగవంతుని స్వరూపమే అనే భావన అందరికీ కలుగుతుంది. రామ్ నందన్ బోస్లే అనే డాక్టర్‌గా, అలాగే విప్లవకారుని పాత్రలో చందన్ కె. ఆనంద్ కూడా జీవించారు. హీరో భార్య పాత్రలో పూర్ణిమ తివారి న‌ట‌న బాగుంది. నీమ్ కరోలి బాబా చిన్నప్పటి పాత్ర పోషించిన చైల్డ్ ఆర్టిస్టులు కూడా మెప్పించారు. మిగతా నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా, వారి పాత్రలు థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినా వెంటాడుతాయి.

Hanuman Ansh Movie Review And Rating

సాంకేతిక వర్గం పనితీరు: నీమ్ కరోలి బాబా జీవితం పై దర్శకుడు విశాల్ చతుర్వేది ఎంతో రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎంతో మంది ఇండియన్ స్టార్ సెలబ్రిటీలు ఈయన్ని కలవడానికి వెళ్లినట్టు చాలా వార్తలు వచ్చాయి. అయితే అలాంటి వాటి జోలికి పోకుండా ఫిక్షన్ జోడించి కేవలం ఆయన మహత్యాలు మాత్రమే చూపించారు ఇందులో. చెప్పుకోవడానికి కథ ఏమీ లేకపోయినా కథనాన్ని దర్శకుడు నడిపించిన తీరు అభినందనీయం. ఎటువంటి డీవియేషన్స్ లేకుండా తాను ఏదైతే ప్రెజెంట్ చేయాలనుకున్నారో దానిని ప్రెజెంట్ చేయగలిగారు. ఆడియన్స్ ను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లగలిగారు. అయితే కొన్ని చోట్ల నిర్మాణ లోపాలు కనిపించాయి. కొన్ని చోట్ల కెమెరా షేక్ అవ్వడంతో ఆ విజువల్స్ వి లాగర్ వీడియోలని తలపిస్తాయి.

అలాగే మరికొన్ని చోట్ల సీజీ వర్క్ ఇంకాస్త ఉంటే బాగుణ్ణు అనిపిస్తాయి. బహుశా బడ్జెట్ పరిమితులకు లోబడి చేయడం వల్ల.. ఆ లోటు కనిపించింది అనుకోవాలి. ఈ సినిమాకి ముగ్గురు సంగీత దర్శకులు ఉన్నారు. ఇలా ఎక్కువ మంది పనిచేస్తే సినిమా మూడ్ కి తగ్గట్టు ఔట్పుట్ ఇవ్వడం కష్టం అవుతుంది. కానీ ఇక్కడ ముగ్గురూ బెస్ట్ వర్క్ ఇచ్చారు. ఎడిటింగ్ లోపాలు కూడా ఇందులో అక్కడక్కడా కనిపించాయి. సెకండాఫ్ లో ఇంకొంత భాగం ట్రిమ్ చేసుంటే బాగుండేది.

Hanuman Ansh Movie Review And Rating

విశ్లేషణ: నీమ్ కరోలి బాబా జీవితం గురించి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా అవ‌గాహ‌న లేదు. ఆయ‌న జీవితంపై సినిమా రావ‌డం, సోషల్ మీడియాలో ఇదొక కల్ట్ సినిమా అని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో హ‌నుమాన్ అంశ్‌పై తెలుగు ఆడియెన్స్‌లో ఆస‌క్తి ఏర్ప‌డింది. పెద్ద‌గా ప్ర‌చారం లేక‌పోయినా హిందీ క‌లెక్ష‌న్స్‌, టాక్ కార‌ణంగా టాలీవుడ్‌లో ఈ సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది. దానికి తగ్గట్టే తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. లిప్ సింక్ వంటివి అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది.

ప్రేక్షకులందరినీ ఆధ్యాత్మిక ధ్యానంలోకి తీసుకెళ్లే విధంగా ఉంది. సెకండాఫ్ లో నిడివి ఎక్కువైంది. కొన్ని చోట్ల స్లోగా అనిపిస్తుంది. అలాగే షిరిడీ సాయి మహత్యం వంటి సినిమాలు చూసిన వారికి హనుమాన్ అంశ్ కొత్తగా ఏమీ అనిపించదు. కానీ ఇప్పటి జెన్‌జీ యువతలో సామాజిక స్పృహ రేకెత్తించాలి అంటే ఇలాంటి సినిమాలు అవసరం అని అనిపిస్తుంది. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్నంగా మంచి భ‌క్తి సినిమాలా ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించిన తీరు బాగుంది.

Hanuman Ansh Movie Review And Rating

ఫోకస్ పాయింట్: ఆధ్యాత్మిక స్పృహ కల్పించే హనుమాన్ అంశ్

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandan Anand
  • #Dr. Vishal Chaturvedi
  • #Hanuman Ansh Movie
  • #Purnima Tiwari
  • #Shobhinao Satya

Reviews

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

48 mins ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

5 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

22 hours ago

latest news

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

33 mins ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 hour ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

4 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

23 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version