Hanuman OTT: సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ ‘హనుమాన్‌’ ఓటీటీకి వచ్చేసింది… కానీ!

  • March 17, 2024 / 07:08 PM IST

థియేటర్లలో ‘హనుమాన్‌’ (Hanuman) సినిమా చూసినోళ్లు, చూడనోళ్లు… ‘హనుమాన్‌’ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. వెండితెరపై చూసినోళ్లోమో మరోసారి చూసి ఆ మ్యాజిక్‌ను ఎంజాయ్‌ చేద్దాం అనుకుంటున్నారు. ఇలా అనుకుంటున్న వాళ్ల లిస్ట్‌లో మీరు కూడా ఉంటే మీకు శుభవార్త అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఓ చిన్న మెలిక ఉంది. అది మీకు హిందీ అర్థం అయితేనే చూడొచ్చు. ఎందుకంటే సినిమా హిందీ వెర్షన్‌ మాత్రమే ఓటీటీలోకి వచ్చేసింద.

ఇక్కడో బంపర్‌ ఆఫర్‌ ఏంటంటే.. సినిమాను ఆ ఓటీటీలో లాగిన్‌ అయ్యి ఉచితంగా చూసేయొచ్చు. ‘హను – మాన్‌’ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నవాళ్లకు జీ 5 వరుస వాయిదాలు వేస్తూ చెప్పడం లేదు. మార్చి 8 పక్కా అని అనుకుంటే… ఆ రోజు కూడా రిలీజ్‌ చేయలేదు. దర్శకుడు అయితే మాకు కాస్త సమయం ఇవ్వండి త్వరలోనే రిలీజ్‌ డేట్‌ చెబుతాం అని అన్నారు. అయితే మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ ఛానల్‌లో, జియో సినిమా ఓటీటీలో ‘హను – మాన్‌’ హిందీ వెర్షన్‌ వచ్చేసింది.

దీంతో ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.ఈ రోజుల్లో ఓటీటీ కంటే ముందు టీవీల్లో రావడం ఏంటి? అనే ఆశ్చర్యం దాటి ఇప్పుడు ఏదైతేముంది హిందీలో చూసేద్దాం అంటూ సినిమా ప్రేమికులు చూసేస్తున్నారు. అయితే ఇతర భాషల ప్రేక్షకులు మాత్రం మా సొంత లాంగ్వేజ్‌లో సినిమా చూస్తే బాగుండు త్వరగా రిలీజ్‌ చేయండి అని అడుగుతున్నారు.

ఇక్కడో విషయం ఏంటంటే ఈ సినిమా రీజనల్‌ లాంగ్వేజ్‌లో వివిధ ఓటీటీల్లో వస్తోంది అని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ లేదు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హను మాన్‌’ సినిమా బాక్సాఫీసు దగ్గర ఘన విజయాన్ని అందుకుంది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ పిక్చర్‌ రూ.330 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. మరి టీవీ, ఓటీటీల్లో ఏ మేరకు రికార్డులు సాధిస్తుందో చూడాలి.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus