Sree Vishnu: ‘హరిహర వీరమల్లు’ వాయిదాని కన్ఫర్మ్ చేసిన శ్రీ విష్ణు..!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)  సినిమా రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా వస్తుందని మొదట ప్రకటించారు. అది ప్రకటనగానే మిగిలింది. తర్వాత 2023 సంక్రాంతికి ఛాన్స్ ఉందన్నారు. అలాంటిది కూడా జరగలేదు. తర్వాత ఇంకో రెండు, మూడు డేట్లు మారాయి. ఫైనల్ గా మే 9 ఫిక్స్ అన్నారు. దీంతో ఈ డేట్ కి రావాల్సిన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. చాలా సినిమాల ప్లానింగ్స్ కూడా మారిపోయాయి.

Sree Vishnu

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ ఈ డేట్ కి వచ్చే అవకాశం లేదు అనే టాక్ రన్ అవుతుంది. కానీ మేకర్స్ అయితే అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. నెక్స్ట్ రిలీజ్ డేట్ తో వాయిదా విషయాన్ని వెల్లడించాలని వారు చూస్తున్నట్టు స్పష్టమవుతుంది. అయితే ఈ లోపు పలు చిన్న సినిమాలు ఈ విషయాన్ని పరోక్షంగా కన్ఫర్మ్ చేసేస్తున్నాయి. ఇప్పటికే సమంత (Samantha) నిర్మిస్తున్న ‘శుభం’ (Subham) చిత్రం మే 9కి రాబోతున్నట్టు అనౌన్స్ చేశారు.

అలాగే శ్రద్దా శ్రీనాథ్ (Shradha Srinath) ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘కలియుగమ్ 2064’ చిత్రం కూడా మే 9నే విడుదల కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు శ్రీవిష్ణు (Sree Vishnu) కూడా ఈ డేట్ పై కన్నేశాడు. అతను హీరోగా సింగిల్ (Single) అనే సినిమా రూపొందుతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాని మే 9న విడుదల చేయబోతున్నట్టు ఓ వీడియో ద్వారా చిత్ర బృందం రివీల్ చేసింది.

వాస్తవానికి మే 9 చాలా మంచి డేట్. ‘గ్యాంగ్ లీడర్’ (Gangleader) ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) ‘మహానటి’ (Mahanati) ‘మహర్షి’ (Maharshi) వంటి సినిమా ఇదే డేట్ కి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. అందుకే సెంటిమెంట్ గా ఆ డేట్ కి చిన్న సినిమాలు కర్చీఫ్ వేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే శ్రీవిష్ణు (Sree Vishnu) సినిమాకే ఎక్కువ అడ్వాంటేజ్ చేకూరే అవకాశం కూడా ఉందనేది కొందరి అభిప్రాయం.

చిరంజీవి అయిపోయిన నాగచైతన్య.. నోరు జారి మ్యూట్‌ చేసి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus