‘తండేల్’ (Thandel) సినిమాతో ఇటీవల పాన్ ఇండియా మార్కెట్‌ను చిన్నగా టచ్ చేసి వచ్చేశాడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). తన తర్వాతి సినిమా విషయంలో కచ్చితంగా పాన్ ఇండియా ఫీవర్‌ను చూపించాలని ఫిక్స్ అయ్యారు అనిపిస్తోంది. రీసెంట్‌గా ఆయన తన తర్వాతి సినిమా గురించి చెబుతున్న విషయాలు చూస్తుంటే ఈసారి అక్కినేని కుర్రోడు గట్టిగా కొట్టేలా ఉన్నాడు. ‘విరూపాక్ష’తో (Virupaksha) విషయం ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తిక్ దండు (Karthik Varma Dandu) తెరకెక్కిస్తున్న సినిమా అది. ‘తండేల్’ సినిమా సమయంలోనే కార్తిక్ దండు సినిమాను నాగచైతన్య ఓకే చేశాడు.
మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతుంది సినిమా అని పోస్టర్ ద్వారానే చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమా చిత్రీకణ పది రోజుల క్రితం మొదలైంది. దీని గురించి ఆ సమయంలో చైతు చెప్పిన విషయాలు.. (కాదు కాదు చైతు లీక్స్ అనొచ్చు) ఇప్పుడు బయటకు వచ్చాయి. సినిమా గురించి చెబుతూ చెబుతూ ఆయన టైటిల్ కూడా చెప్పేశారు. ఆ తర్వాత టైటిల్ అనౌన్స్ చేయలేదు కదా అని నాలుక కరుచుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే తన 15 ఏళ్ల కెరీర్‌లో ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాను చేయలేదు అని చైతన్య గొప్పగా చెప్పాడు. సినిమాను ఓ ట్రెజర్ హంట్ కాన్సెప్ట్‌లో రూపొందిస్తున్నామని, భారీగా వీఎఫ్‌ఎక్స్ ఉంటాయని కూడా చెప్పాడు. ఈ సినిమా షూటింగ్‌లో ఎప్పుడెప్పుడు పాల్గొంటానా అని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానని కూడా చెప్పాడు మరి చైతు అంత గొప్పగా చెప్పాడు అంటూ సినిమా కథలో ఏదో స్పెషల్ ఉందనే చెప్పాలి.
‘విరూపాక్ష’తో తన రైటింగ్, టేకింగ్ పవర్ ఏంటో ఇప్పటికే చేసి చూపించారు దర్శకుడు కార్తిక్ దండు. మరిప్పుడు ఎలాంటి కథను ఎంచుకున్నారో చూడాలి. అలాగే ఈ సినిమాతో అయినా పాన్ ఇండియా, రూ.100 కోట్ల క్లబ్‌లో నాగచైతన్య బలంగా నిలబడడాలి అని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.