పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రీ- ఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) తర్వాత ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ప్రాజెక్టు మొదలైంది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లో 27వ సినిమాగా మొదలైంది. ఆ తర్వాత మొదలైన 28,29 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పటికీ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అయ్యింది లేదు. దాదాపు 5 సార్లు రిలీజ్ వాయిదా పడింది ఈ సినిమా. మే 9న రిలీజ్ అని ప్రకటించినా.. ఆ హడావిడి ఏమీ కనిపించడం లేదు.
నిర్మాత ప్రమోషన్స్ వంటివి మొదలు పెట్టింది లేదు. అసలు షూటింగ్ మొదలైతే కదా రిలీజ్ అవ్వడానికి..! పవన్ కళ్యాణ్ ఇంకో 5 రోజుల డేట్స్ ఇస్తేనే కానీ కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు ఆయన ఉన్న బిజీకి అసలు డేట్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది..! మరోపక్క మే 9న కనుక ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ చేసే ఉద్దేశం లేకపోతే… ఓటీటీ రైట్స్ రూపంలో ఇచ్చిన సగం అమౌంట్ వెనక్కి ఇవ్వాలని అమెజాన్ ప్రైమ్ సంస్థ డిమాండ్ చేసింది.
అయితే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలో చిన్నపాటి డిస్టర్బన్స్ రావడంతో.. 2 నెలలు గడువు ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాత ఏ.ఎం.రత్నం (AM Rathnam) ఈ సినిమాకి రూ.100 కోట్లు థియేట్రికల్ బిజినెస్ ఆశిస్తున్నట్టు అందరి వద్ద చెబుతున్నారట. ఆయన బయ్యర్స్ కి చెబుతున్న రేట్లు షాకిస్తున్నట్టు తెలుస్తుంది. రూ.160 కోట్ల వరకు బడ్జెట్ పెట్టానని,సినిమా చారిత్రాత్మక విజయం సాధిస్తుందని ఆయన చెబుతున్నారట. పాపం బడ్జెట్ రికవరీ చేసుకోవడానికి ఆయన కష్టాలు ఆయన పడుతున్నాడు.