పవన్ కళ్యాణ్, దర్శకుడు జ్యోతి కృష్ణ కలయికలో వచ్చిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం మొత్తానికి రూ.100 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకుంది. అయితే బ్రేక్ ఈవెన్ కి ఇవి ఎంత మాత్రం సరిపోవు అనే చెప్పాలి. జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా తర్వాత జ్యోతి కృష్ణ చేతుల్లోకి వెళ్ళింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా క్రిష్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడం జరిగింది.
తర్వాత జ్యోతి కృష్ణ కథని సరిగ్గా అర్థం చేసుకోలేక ఏదేదో తీసేసి ఫస్ట్ పార్ట్ గా రిలీజ్ చేశారు. అయితే ప్రీమియర్స్ తోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఓపెనింగ్స్ కొంత పర్వాలేదు అనిపించినా వీక్ డేస్ లో బాగా డౌన్ అయిపోయింది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 16.57 cr |
సీడెడ్ | 7.85 cr |
ఉత్తరాంధ్ర | 6.59 cr |
ఈస్ట్ | 4.77 cr |
వెస్ట్ | 3.88 cr |
గుంటూరు | 4.48 cr |
కృష్ణా | 4.09 cr |
నెల్లూరు | 1.73 cr |
ఏపీ+తెలంగాణ | 49.96 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 4.80 cr |
ఓవర్సీస్ | 6.36 cr |
వరల్డ్ టోటల్ | 61.12 cr (షేర్) |
‘హరిహర వీరమల్లు’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.121 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.61.12 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.100.16 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.59.88 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈరోజుతో ‘హరిహర వీరమల్లు’ పవర్ ప్లే ముగుస్తుంది. ఎందుకంటే రేపటి నుండి ‘కింగ్డమ్’ ఎంటర్ అవుతుంది. కాబట్టి స్క్రీన్స్ కూడా తగ్గుతాయి.