‘హరిహర వీరమల్లు’ సినిమా జూలై 24న రిలీజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ కూడా ప్రమోషన్స్ లో జాయిన్ అయ్యి.. సినిమాకి పుష్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు, రేపు కూడా పవన్ మీడియాతో ముచ్చటించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాని జ్యోతి కృష్ణ కంప్లీట్ చేశారు. ప్రమోషన్స్ లో మొన్నటి వరకు క్రిష్ పేరు పెద్దగా వినిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ తన స్పీచ్..లలో క్రిష్ కు కూడా క్రెడిట్ ఇచ్చారు.
ఆయన మంచి ఐడియాతో రావడం వల్లనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని.. ఓపెన్ గా చెప్పుకొచ్చారు పవన్. జ్యోతి కృష్ణ కూడా ప్రమోషన్స్ భారాన్ని తన భుజంపై వేసుకుని నడిపించారని పవన్ ప్రశంసించారు. ఇదే సమయంలో దీని సీక్వెల్ ను ఉద్దేశించి కూడా పవన్ స్పందించారు.
‘హరిహర వీరమల్లు’ మొదటి భాగం చాలా బాగా వచ్చిందని. సినిమాలో మంచి మెసేజ్ ఉంటుందని, చరిత్రని కళ్ళకు కట్టినట్టు చూపించడానికి నిర్మాత ఏ.ఎం.రత్నం ముందుకొచ్చారని. 2వ భాగాన్ని కూడా జనాల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేస్తున్నారని పవన్ అన్నారు.
మరోపక్క నిధి అగర్వాల్ కూడా రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ 20 శాతం కంప్లీట్ అయ్యిందని తెలిపారు. సో ‘హరిహర వీరమల్లు’ సీక్వెల్ ఆశలు సజీవంగానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ రెండో భాగానికి డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారు? అనేది ప్రశ్నార్ధకం. కానీ ‘హరిహర వీరమల్లు’ రెండో భాగం ఉండే అవకాశాలు ఉన్నాయి.