Harish Shankar: పవన్ కళ్యాణ్ పై హరీష్ శంకర్ ఊహించని కామెంట్లు !

హరీష్ శంకర్ (Harish Shankar).. పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan)  వీరాభిమాని. అందులో ఎలాంటి డౌట్ లేదు అని ‘గబ్బర్ సింగ్’ ప్రూవ్ చేసింది. 10 ఏళ్ళ పాటు ప్లాపులతో అల్లాడుతున్న పవన్ కళ్యాణ్ కి.. ‘గబ్బర్ సింగ్’ వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆదుకున్నాడు. వాళ్ళ ఫ్యాన్స్ ఆకలి కూడా తీర్చాడు. ఇక దాదాపు పుష్కర కాలం తర్వాత వీరి కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రూపొందుతుంది. దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండటం వల్ల… ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి సరిగ్గా డేట్స్ ఇవ్వలేకపొతున్నాడు.

Harish Shankar

అంతేకాదు ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన తర్వాత పవన్ ఈ సినిమాకి వెంటనే డేట్స్ ఇచ్చింది లేదు. ఈ విషయమై పవన్ కళ్యాణ్ ను గట్టిగా నిలదీసే ధైర్యం హరీష్ కి లేదు. పలు సందర్భాల్లో పవన్ ని మీట్ అయ్యి.. ‘షుగర్ కోటెడ్లో’ అడుగుతూ వచ్చాడు. ఆ తర్వాత నిర్మాతలు పవన్ కళ్యాణ్ పై ఛాంబర్లో ఫిర్యాదు చేయడానికి కూడా రెడీ అయిపోయారు. అప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’  (Ustaad Bhagat Singh) షూటింగ్లో పాల్గొన్నాడు. తర్వాత ఎన్నికల టైం వచ్చింది. అందువల్ల సినిమాలకి పవన్ కళ్యాణ్ గ్యాప్ ఇవ్వడం జరిగింది.

ఇక ఇప్పుడు షూటింగ్ల కోసం కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాస్ట్ ప్రియారిటీలో ఉంది. అయినప్పటికీ హరీష్ మళ్ళీ పవన్ ను కలిసినప్పుడు.. ‘డేట్స్ ఇస్తాను. కానీ స్క్రిప్ట్ మళ్ళీ చూసే టైం లేదు. కాబట్టి.. మిగతా భాగాన్ని ఏఐలో డిజైన్ చేసి చూపించు’ అని హరీష్ తో పవన్ చెప్పారట. అందువల్ల ఏఐ(ARTIFICIAL INTELLIGENCE ) గురించి తెలియకపోయినా హరీష్.. ప్రోయేషనల్ ను పెట్టుకుని బ్యాలన్స్ పార్ట్ ను డిజైన్ చేసి పవన్ కి చూపించబోతున్నాడు.

అప్పుడు పవన్ కి ఫినిష్ చేయడం ఈజీ అవుతుంది. అయితే ఈ తలపోట్లు అన్నీ హరీష్ కి చిరాకు తెప్పించడంతో నిన్న ‘డ్రాగన్’ (Dragon) ప్రెస్ మీట్లో అతను బయటపడినట్టు తెలుస్తుంది. ‘మనమే హీరోలుగా బాగుంటాము అనే థాట్ వస్తే.. డైరెక్టర్లు కూడా హీరోగా చేయడం బెటర్ అని ప్రదీప్ ప్రూవ్ చేశాడు. అప్పుడు హీరోల కాల్షీట్ల ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండదు.

దర్శకుడు అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు (Mahesh Babu) వంటి హీరోల గురించే మాట్లాడుతుండటం నాకు నచ్చలేదు. తెలుగు వాళ్ళు హీరో గురించి పట్టించుకోకుండా పక్క భాషల్లో రూపొందిన సినిమాలు చూసి సూపర్ హిట్లు చేస్తారు. కానీ తెలుగులో అలాంటి సినిమాలు చేస్తే చూడరు’ అంటూ తన ఫ్రస్ట్రేషన్ ను బయటపెడుతూనే పవన్ కళ్యాణ్ కి చురకలు అంటించాడు హరీష్ శంకర్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus