‘ప్రిన్స్’ ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ పై దర్శకుడు హరీష్ శంకర్ ఫన్నీ కామెంట్స్..!

శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘ప్రిన్స్’ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కాబోతుంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ హరీష్ శంకర్ లు గెస్ట్ లుగా విచ్చేసారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ పై హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

హరీష్ శంకర్ మాట్లాడుతూ… ‘ఏషియన్ సునీల్ గారు, సురేష్ బాబు గారు, రామ్మోహన్ గారు.. వీళ్లంతా నాకు చాలా కావాల్సిన మనుషులు. ఈ సినిమా ఫంక్షన్ కు వచ్చేవరకు ‘ప్రిన్స్’ కి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న విషయం నాకు తెలీదు. ‘బావా ఎన్ని సినిమాలు చేస్తున్నావ్ రా నువ్వు’.(నవ్వుతూ). కంగ్రాట్స్ బావా ‘బింబిలి’ ‘జెస్సికా’ సాంగ్స్ నాకు ఫేవరెట్. చాలా బాగా చేశాడు తమన్. అనుదీప్.. ఏం చదువుకున్నాడు అని ఇందాక సుమ గారు అడిగారు. నాకు తెలిసి అతను మిడిల్ క్లాస్ లైఫ్ ను బాగా చదివాడు. అందుకే అతను అంత సీరియస్ గా ఉంటున్నాడేమో.

అది నేను అర్ధం చేసుకోగలను. రమణ గారు,ముళ్ళపూడి వెంకట రమణ గారు, జంధ్యాల గారు, బాపు గారు వీళ్ళందరూ కూడా ఒక మిడిల్ క్లాస్ మనస్తత్వాన్ని బాగా అర్ధం చేసుకుని కామెడీని పండించారు. కాబట్టి జంధ్యాల గారు చెప్పినట్టు కామెడీ చాలా సీరియస్ గా చేయాలి లేదంటే కామెడీ వెకిలిగా అయిపోద్ది అందుకే అతను అంత సీరియస్ నెస్ మెయింటైన్ చేస్తున్నాడు నాకు అర్ధమైపోయింది.’ అంటూ చెప్పి విజయ్ దేవరకొండ గురించి.. ‘విజయ్ నిన్ను విష్ చేయాలంటే టెన్షన్ గా ఉంది.ఎందుకంటే మామూలుగా ఒక్కసారి కలిస్తేనే వెబ్ సైట్లలో ఒక 10 స్టోరీలు వస్తున్నాయి’ అంటూ చమత్కరించాడు.

తర్వాత వాటిని ఎంజాయ్ చేద్దాం అంటూ కూడా తెలిపాడు హరీష్. సినిమా వాళ్ళ పై వార్తలు రావడం సహజం. నిప్పు లేకుండా పొగ రాదు అంటారు.ఊరికే హరీష్ గురించి రాయడానికి అతనేమీ ‘బాహుబలి’ తీయలేదు కదా. అతను తీసిన ‘గబ్బర్ సింగ్’ నే ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాడు. హిట్టు కాని సినిమాలను హిట్ అని చెప్పుకుంటాడు. స్టార్ డైరెక్టర్ అయ్యుండి కూడా ఓ హుందాతనం లేకుండా ఇలా న్యూస్ ల గురించి సెటైర్లు వేయడం, భయపడడం ఎందుకో..!

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus