‘ఉస్తాద్ భగత్ సింగ్’… ఈ సినిమా ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తయింది. అయితే అప్పుడే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది అంటూ ఓ పుకారు వినిపిస్తోంది. దీంతో ఇదెలా సాధ్యం. రెండు షెడ్యూళ్లలో అంత సినిమా ఎలా తీసేస్తారు అంటూ ఓ డౌట్ రెయిజ్ చేస్తున్న పవన్ కల్యాణ్ అభిమానులు, నెటిజన్లు. మొన్నామధ్య ‘ఓజీ’ విషయంలోనూ ఇదే జరిగింది అనుకోండి. ఆ సినిమా సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు ‘ఉస్తాద్..’ ఇలా వేగంగా తీయడం వల్ల క్వాలిటీ ఎలా ఉంటుందో అనే డౌట్ మీకు వచ్చిందా? మీకే కాదు చాలా మందికి వచ్చింది.
అయితే ఇదే ప్రశ్న ఒక నెటిజన్ సోషల్ మీడియాలో నేరుగా హరీశ్ శంకర్‌నే అడిగారు. అయితే దానికి ఆయన కూల్‌గా సమాధానం ఇస్తారేమో అనుకుంటే… చాలా హాట్‌గా సమాధానంగా ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఆ పోస్టు, దానికి హరీశ్ శంకర్ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. ‘ఉస్తాద్..’ గురించి వచ్చే వార్తలకు ఆయన అక్కడ రిప్లైలు ఇస్తూనే ఉన్నారు. అలానే ఈ రిప్లై కూడా వచ్చింది.
మామూలుగా అయితే సోషల్ మీడియాలో పేరూ, ఊరూ లేని వాళ్లు చేసే ట్వీట్లు, కామెంట్లను సెలబ్రిటీలు పట్టించుకోరు. అయితే హరీశ్ శంకర్ అలా వదిలేయరు. వాటిలో కొన్ని చూసి కౌంటర్ అటాక్ చేస్తుంటారు. అలా ఆయన ఓ నెటిజన్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చారు. దీంతో ఆ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ 50 శాతం పూర్తయిందట కద అన్నా. ఇక క్వాలిటీ భారం దేవుడి మీదే వేశాం’’ అంటూ వెటకారంగా పోస్ట్ చేశారు ఓ నెటిజన్.
అయితే ఆ పోస్టు చూడగానే (Harish Shankar) హరీశ్ శంకర్‌కు కోపం వచ్చిందో ఏమో… ‘‘అంతే కదా తమ్ముడూ. అంతకుమించి ఏం నువ్వేం చేయగలవు చెప్పు? నువ్వు కాస్త నీ కెరియర్, ఉద్యోగం, చదువు వాటి మీద ఫోకస్ పెట్టు. ఆ విషయాలను దేవుడికి వదిలేయకు. ఆల్ ద బెస్ట్’’ అని రిప్లై ఇచ్చారు. దీంతో ఇబ్బంది పెట్టే మాటలకు హరీశ్ శంకర్ సరైన సమాధానం ఇచ్చారు అనే కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే నిజానికి సినిమా 50 శాతం పూర్తయిందా లేదా అనే విషయం తేల్చలేదు.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!