Harish Shankar: పవన్, రవితేజ మల్టీస్టారర్ గురించి హరీష్ శంకర్ క్లారిటీ ఇదే!

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో షాక్ (Shock) , రామయ్యా వస్తావయ్యా (Ramayya Vasthavayya) మినహా మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడానికి ఇష్టపడే ఈ దర్శకుడు తన సినిమాలలో డైలాగ్స్ సైతం అద్భుతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan)  సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ మాస్ ప్రేక్షకులను మెప్పిస్తోంది.

Harish Shankar

వింటేజ్ రవితేజను (Ravi Teja)  గుర్తు చేసే విధంగా ఈ ట్రైలర్ ఉందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రవితేజ, పవన్ (Pawan Kalyan)  లతో పని చేసిన హరీష్ శంకర్ కు ఈ ఇద్దరు హీరోల మధ్య ఉన్న కామన్ పాయింట్ చెప్పాలని ప్రశ్న ఎదురు కాగా ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఫెయిల్యూర్ ను, సక్సెస్ ను పట్టించుకోరని చెప్పుకొచ్చారు. ఫెయిల్యూర్, సక్సెస్ ను ఈ హీరోలు సీరియస్ గా తీసుకోరని హరీష్ శంకర్ కామెంట్లు చేశారు.

రవితేజ, పవన్ లతో కలిసి మల్టీస్టారర్ తెరకెక్కించాలని కొంతమంది నెటిజన్లు కోరగా కచ్చితంగా ప్రయత్నిస్తానని హరీష్ శంకర్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కాంబినేషన్ ఇప్పట్లో సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా విడుదలవుతుండగా టాక్ ఈ సినిమాకు కీలకం కానుందని చెప్పవచ్చు. మిస్టర్ బచ్చన్ కు పోటీగా పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి.

షర్మిల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.. అలేఖ్య కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus