హ్యాట్రిక్ ప్లాపులతో చైతూ అయోమయం.!

‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంతో మంచి హిట్టు కొట్టిన నాగ చైతన్య కు తరువాత చేసిన సినిమాలు నిరాశపరిచయనే చెప్పాలి. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘యుద్ధం శరణం’ ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. ఇక మారుతీ డైరెక్షన్లో అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం ఓపెనింగ్స్ ను బాగానే రాబట్టినప్పటికీ చైతూకి హిట్టివ్వలేకపోయింది. ‘ప్రేమమ్’ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటి తో చేసిన ‘సవ్యసాచి’ చిత్రం కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

సమంతతో పెళ్లైన తరువాత నాగ చైతన్య సినిమాల విషయంలో నాగార్జున ఎక్కువ దృష్టి పెట్టట్లేదట. అందుకే వరుసగా ప్లాపులు వస్తున్నాయంటూ ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. క్లాస్ అండ్ ఫ్యామిలీ చిత్రాలు చేసిన ప్రతీసారి చైతన్యకు హిట్ దక్కింది. అయితే మాస్ చిత్రాలు చేస్తే ప్లాపులు తప్పడం లేదు. అప్పుడెప్పుడో సునీల్ తో కలిసి చేసిన ‘తడాకా’ చిత్రం తప్ప చైతన్యకు ఒక్క మాస్ హిట్టు కూడా లేదు. అంతే కాదు మార్కెట్ పరంగా కూడా చైతన్య బాగా వెనుకపడి ఉన్నాడు. ప్రస్తుతం సమంతతో కలిసి నటిస్తున్న ‘మజిలీ’ చిత్రంతో పాటు మేర్లపాక గాంధీ డైరెక్షన్లో యూవీ క్రియేషన్స్ సంస్ద నిర్మిస్తున్న చిత్రం కూడా లైన్లో ఉంది. మరి ఈ చిత్రాల రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus