Keerthy Suresh: కీర్తి సురేష్ పక్కన ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా.. ఎంత క్లోజ్ అంటే?

ఈతరం హీరోయిన్లలో అభినయ ప్రధాన పాత్రలకు ఎక్కువగా ఓటేస్తున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కీర్తి సురేష్ సర్కారు వారి పాట, దసరా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల కంటే స్టార్ హీరోలకు జోడీగా నటించిన సినిమాలు ఈ బ్యూటీకి మంచి పేరును తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని నమ్మకాన్ని కలిగి ఉన్నారు.

ఈ ఏడాది ఆగష్టు 11వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు కీర్తి సురేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. కీర్తి సురేష్ వయస్సు 30 సంవత్సరాలు కాగా పెళ్లి కోసమే కీర్తి సురేష్ కొత్త ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పడం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే కీర్తి సురేష్ ఫర్హాన్ అనే వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఫర్హాన్ కీర్తి బాయ్ ఫ్రెండ్ అని సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

ఫర్హాన్ ప్రముఖ వ్యాపారవేత్త కాగా అటు కీర్తి సురేష్ ఇటు ఫర్హాన్ ఒకే కలర్ షర్ట్ లో కనిపించడంతో ఈ కామెంట్లు ప్రచారంలోకి వచ్చాయి. కొంతమంది నెటిజన్లు అయితే ఏకంగా ఫర్హాన్ కీర్తి సురేష్ జోడీ బాగుందని చెబుతున్నారు. అయితే కీర్తి సురేష్ సన్నిహితులు మాత్రం వైరల్ అవుతున్న ఫోటోల గురించి మరోలా స్పందిస్తున్నారు. ఫర్హాన్ కీర్తి సురేష్ చిన్ననాటి స్నేహితుడని వాళ్లు చెబుతున్నారు.

కీర్తి సురేష్ (Keerthy Suresh) తన బాయ్ ఫ్రెండ్, పెళ్లి గురించి పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తే మాత్రమే అసలు వాస్తవాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది. యంగ్ జనరేషన్ స్టార్స్ కు కీర్తి సురేష్ జోడీగా నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కీర్తి సురేష్ పారితోషికం మూడు కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus