అబ్బా హెబ్బా మరీ 24 ముద్దులా

కుమారి 21ఎఫ్ సినిమాలో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసిన అందం హెబ్బా పటేల్ ది. చారెడేసి కళ్లతో.. కవ్వించే చూపుల్తో గ్లామర్ హీరోయిన్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న ఆమె వరస పెట్టి ఛాన్సులు దక్కించుకుంది. కానీ తొలిసినిమా స్థాయిలో ఆమె యాక్టింగ్ కి మళ్లీ గుర్తింపు రాలేదు. దాంతో సినిమాల రేసులో ఈ మధ్య వెనుకబడింది. ఆమె హీరోయిన్ గా లేటెస్ట్ గా వచ్చిన ఏంజెల్ మూవీ నిజమైన ఏంజెల్ ను మరిపించినా బాక్సాఫీసును మాత్రం మెప్పించలేకపోయింది. దీంతో సినిమాల సెలక్షన్ విషయంలో హెబ్బా కాస్త ఆచితూచి అడుగులేయడం మొదలెట్టింది. తాజాగా మిణుగురులు సినిమాతో అవార్డ్ దక్కించుకున్న అయోధ్య కుమార్ డైరెక్షన్ లో ఓ లవ్ స్టోరీ చేయడానికి ఒప్పుకొంది. ఈ మూవీ మరోసారి తన నటనకు గుర్తింపు తెచ్చిపెడుతుందని హెబ్బా ఆశపడుతోంది.

ఇంతకుముందు తాను చేసిన సినిమాల్లో ఎప్పుడూ ఇలాంటి రోల్ చేయలేదని అంటోంది. కచ్చితంగా ఈ పాత్ర ఆడియన్స్ ను ఆశ్చర్య పరిచేలా ఉంటుందని నమ్మకంగా చెబుతోంది. అందుకే ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఏంటి అన్నది బయటపెట్టనని చెప్పుకొస్తోంది. ఇంతకుముందు చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన తేజ సజ్జ ఈ మూవీలో హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇంతవరకు గ్లామర్ తోనే మెప్పించుకుంటూ వచ్చినా ఈసారి నటనతో ఆకట్టుకుంటానన్న హెబ్బా ఎంతవరకు మెప్పిస్తుందో చూద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus