బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎన్నో వెబ్‌సిరీస్‌లు వచ్చాయి. యాక్షన్, డ్రామా, గ్లామర్ జోనర్‌లో వచ్చిన ఆ సిరీస్‌లు అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు. అందులో నెట్‌ఫ్లిక్స్ నుండి చాలా వచ్చాయి.. మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టాయి. కానీ ఓ వెబ్‌సిరీస్ ఇచ్చినంత హైప్, డౌన్స్‌లోడ్స్ ఇంకేదీ ఇవ్వలేదు అని అంటారు బాలీవుడ్ వర్గాల్లో. అదే ‘హీరామండీ’. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితీ రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్.. ఇలా బాలీవుడ్ తారలందరినీ మహారాణులగా ఓకే ఫ్రేమ్‌లో చూపించింది ‘హీరామండీ: ది డైమండ్ బజార్’.
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘హీరామండీ’ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఆయన స్టైల్‌లో భారీతనం, భారీ తారాగణంతో రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడు మరోసారి ఆ ప్రయత్నం చేయబోతున్నారు. అదే తరహాలో మరో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి ప్రేక్షకుల్ని మెప్పించడానికి ఈ సిరీస్ సీక్వెల్‌గా రాబోతోందట. ఆ సిరీస్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు సిరీస్ రచయితలలో ఒకరైన విభు పూరి ఇటీవల తెలిపారు.

‘హీరామండీ’ సిరీస్ ఈ తరం ప్రేక్షకులకు నచ్చుతుందా? అర్థమవుతుందా? అని కొందరు తొలుత డౌట్ పడ్డాటర. కానీ ఆ సమయంలో సిరీస్ టీమ్ చాలా ధైర్యంగా ముందుకెళ్లింది. ప్రేక్షకులు హీరామండీ ప్రపంచాన్ని స్వీకరించి ఆదరించారు. అందుకే ‘హీరామండీ 2’ చేయాలని అనుకున్నాం అని విభు చెప్పారు. ప్రస్తుతం సిరీస్ స్క్రిప్ట్ దశలో ఉందని తెలిపారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న వేశ్యల జీవితాధారంగా తొలి సీజన్ రూపొందించారు. ఇప్పుడు కూడా అదే నేపథ్యానికి దగ్గరలో ఉండేలా చూసుకుంటున్నారట.
అయితే, ఈ సారి సిరీస్‌లో ఎవరు ప్రధాన పాత్రధారులు అనేది ఇంకా తేలలేదు. అయితే గతంలో ఓ సందర్భంగా టీమ్ కంటిన్యూ అవ్వొచ్చు అని ‘హీరామండీ’ లేడీస్ చెప్పారు. కొత్తవాళ్లు యాడ్ అయ్యే అవకాశమూ ఉందన్నారు. చూద్దాం షూటింగ్ మొదలయ్యాక కాస్త క్లారిటీ రావొచ్చు ఈ విషయంలో.
