హేమంత్ మధుకర్ (Hemant Madhukar).. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. అనుష్కతో ‘నిశ్శబ్దం’ (Nishabdham) అనే సినిమా తీశాడు. కోవిడ్ లాక్ డౌన్ టైంలో ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నేరుగా రిలీజ్ అయ్యింది. దీనికి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ‘అటు థ్రిల్లర్ కాకుండా, ఇటు హర్రర్ కాకుండా చాలా ఫ్లాట్ గా ఈ సినిమా ఉంది. ఏ దశలోనూ ఆకట్టుకునే విధంగా ఈ సినిమా లేదు’ అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. ఓపెనింగ్ సీన్ కి.. క్లైమాక్స్ కి ఎటువంటి సంబంధం లేదని అంతా చెప్పుకొచ్చారు.
అయినప్పటికీ అనుష్క నుండి కొంత గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో.. ప్రేక్షకులు దీన్ని బాగానే చూశారు అని చెప్పాలి. ‘నిశ్శబ్దం’ కి ముందు హేమంత్ మధుకర్ హిందీలో ‘ఎ ఫ్లాట్’ అనే సినిమా తీశాడు. అలాగే మంచు విష్ణుతో (Manchu Vishnu) ‘వస్తాడు నా రాజు’ (Vastadu Naa Raju) అనే సినిమా, హిందీలో ‘ముంబై 125 KM’ అనే సినిమా కూడా తీశాడు. అయితే ‘నిశ్శబ్దం’ తర్వాత హేమంత్ నుండి మరో సినిమా రాలేదు.
బహుశా ‘నిశ్శబ్దం’కి వచ్చిన రెస్పాన్స్ తో గ్యాప్ తీసుకుని మంచి కథ డిజైన్ చేసుకుంటున్నాడేమో అని అంతా అనుకున్నారు. అది నిజమే అయ్యింది. అవును హేమంత్ మధుకర్.. ‘నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్లో ఒక సినిమా చేయబోతున్నాడట. ఇది డివోషనల్ టచ్ ఉన్న ప్రాజెక్టు అని తెలుస్తుంది. కథ ప్రకారం.. భారీ బడ్జెట్, పెద్ద క్యాస్టింగ్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తారట శరత్ మరార్. ఇప్పుడు ఇలాంటి సబ్జెక్టులకు హిందీలో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి హేమంత్ కి ఇది మంచి ఛాన్స్ అనే చెప్పాలి.