నెలకు వందకు పైగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో ఒకటి, రెండు సినిమాలు మాత్రమే హిట్ అవుతూ ఉంటాయి. ఆ ఒకటి, రెండు లిస్ట్..లో ఉండాలని ప్రతి దర్శకుడు, నిర్మాత కష్టపడుతూ ఉంటారు. పోయి పోయి ఎవ్వరూ ప్లాప్ సినిమా తీయాలని అనుకోరు కదా..! ‘హిట్టు సినిమాకి ప్లాప్ సినిమాకి మేకర్స్ పడే కష్టం ఒక్కటే’. కానీ ఫలితాలు ఎవ్వరూ ఊహించలేరు. ఒకవేళ సక్సెస్ కి ఫార్ములా అనేది ఉంటే… ఇండస్ట్రీలో అందరూ సక్సెస్ ఫుల్ సినిమాలే తీస్తారు.
ఇది ప్రతి ఫిలిం మేకర్ గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళు మాత్రమే కాదు హీరోల అభిమానులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలు పక్కన పెట్టేసి.. అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఇటీవల ‘లైలా’ (Laila) అనే సినిమా వచ్చింది. విశ్వక్ సేన్ (Vishwak Sen) ఇందులో హీరో. సాహు గారపాటి (Sahu Garapati) దీనికి నిర్మాత. ఈ సినిమాకి ప్రమోషన్స్ బాగానే చేశారు. కానీ బజ్ ఏర్పడలేదు. దానికి తోడు 30 ఇయర్స్ పృథ్వీ చేసిన పొలిటికల్ కామెంట్స్ వల్ల..
ఈ సినిమాని సోషల్ మీడియాలో ఓ బ్యాచ్ టార్గెట్ చేసింది. అది ఎలా ఉన్నా ఇందులో కంటెంట్ దారుణంగా ఉండటం వల్ల ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. వీకెండ్ కే దుకాణం సర్దేసింది. విశ్వక్ సేన్ కూడా ఈ సినిమాలో ఉన్న లోపాలను గుర్తించి ఆడియన్స్ కి, తన అభిమానులకి క్షమాపణలు చెప్పాడు. అన్నీ ఎలా ఉన్నా ఈ సినిమా ప్రమోషన్స్ లో నిర్మాత సాహు.. ‘ ‘లైలా’ లో లేడీ గెటప్ వేయాలని..
ముగ్గురు హీరోలు ఈ సినిమాని రిజెక్ట్ చేశారు’ అంటూ చెప్పి అందరికీ షాకిచ్చాడు. అంతేకాకుండా వాళ్ళెవరికీ లేని గట్స్ విశ్వక్ సేన్ కి ఉన్నాయి అన్నట్టు కూడా చెప్పాడు. ‘పోనీ నిర్మాత కామెంట్స్ ను బట్టే చూసుకుంటే.. ‘లైలా’ ని రిజెక్ట్ చేసిన ఆ ముగ్గురు హీరోలు అదృష్టవంతులే కదా’..! అని కొందరు అభిప్రాయపడుతున్నారు. నిర్మాత చేసిన వ్యాఖ్యలపై కూడా తర్వాత హీరో విశ్వక్ సేన్ హర్ట్ అయినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.