బిగ్ బాస్ హౌస్ లో లాస్య జెర్నీ ముగిసింది. 11వ వారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకి వచ్చేసింది. నిజానికి ఈవారం ఎవరూ ఊహించని ఎలిమినేషన్ జరిగిందనే అనుకోవాలి. ఎందుకంటే పోలింగ్ పెట్టిన ప్రతి సైట్ లో కూడా లాస్య సేఫ్ జోన్ లోనే ఉంది. మిస్డ్ కాల్ డేటానే చాలా కీలకం కాబట్టి దాని ఆధారంగానే ఈవారం ఎలిమినేషన్ అనేది చేశారు. ఇందులో భాగంగానే లాస్య తన బిగ్ బాస్ హౌస్ జెర్నీని ముగించింది. లాస్య ఎలిమినేషన్ కి తన గేమ్ లో కొన్ని ప్రధానమైన కారణాలు మనం చూసినట్లయితే..,
1. ఓట్లు పడలేదు ఎలిమినేట్ అయ్యింది. అది వేరే విషయం., లాస్య ఫస్ట్ నుంచి గేమ్ లో ఎక్కడా ఎగ్రెసివ్ గా పార్టిసిపేట్ చేయలేదు. పల్పీ టమోటా టాస్క్ నుంచి చూసినట్లయితే, ఎక్కడా కూడా తను టాస్క్ గెలిచిన దాఖలాలు కూడా లేవు. కేవలం వంట చేయడానికి మాత్రమే ఎక్కువగా ప్రిఫెరెన్స్ ఇచ్చింది. అంతేకాదు, అంతమంది అవసరాలు తీర్చిన లాస్య తను గేమ్ లో ఎక్కడున్నాను అనేది చెక్ చేస్కోలేదు. ఫిజికల్ టాస్క్ వరకూ పక్కనబెట్టినా వేరే టాస్క్ ల్లో లాజిక్స్ వర్కౌట్ చేస్తూ గేమ్ ఆడాల్సింది. అది కూడా ఎక్కడా కనిపించలేదు.
2. ఈవారం లాస్యతో పాటుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండటం కూడా లాస్యకి ఓటింగ్ ఎక్కువగా రాలేదనే చెప్పాలి. హారిక, అభిజిత్ ఇద్దరూ కూడా లాస్యతో పాటు ఈసారి నామినేషన్స్ లో ఉన్నారు. అలాగే సోహైల్ అరియానా కూడా ఉన్నారు. వీళ్లకి ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అంతేకాదు, హారిక , అభిజిత్ , లాస్యలు గ్రూప్ గా ఉన్నారు ముగ్గరూ ఈసారి ఉన్నారు కాబట్టి ఓట్లు అనేవి విడిపోయాయి. అందువల్లే మోనాల్ కి, లాస్యకి తక్కువ పర్సేంటేజ్ ఓటింగ్ అనేది జరిగింది. ఒకవేళ అభిజత్, హారిక ఇద్దరూ లేకుండా ఆ ప్లేస్ లో అకిల్ ఉండి ఉంటే ఖచ్చితంగా లాస్య సేఫ్ అయ్యేది. అభిజిత్ ఓటింగ్ లో కొద్దిగా పర్సెంట్ అనేది లాస్యకి వచ్చినా బాగా హెల్ప్ అయ్యేది.
3. ఎక్కువసార్లు నామినేషన్స్ లోకి రాకపోవడం, తను నామినేట్ చేసిన వాళ్లని తిరిగి నామినేట్ చేయడం అనేది కూడా లాస్య గేమ్ ని దెబ్బతీసింది. ఫస్ట్ నుంచి కూడా ఒకటే ఫార్ములాతో వెళ్లింది . ఎవరితోనూ కనెక్ట్ లేకుండా తనతో ఎవరు కనెక్ట్ అవ్వలేదనే రీజన్స్ చెప్పింది లాస్య. టీమ్ గా గ్రూప్స్ గా ఆడే టాస్క్ లలో కూడా గ్రూప్ డిస్కషన్స్ అనేది చేయలేదు. ఎక్కడా కూడా గేమ్ లో దూసుకుని పోలేదనే చెప్పాలి.
4. శనివారం నాగార్జున ఎపిసోడ్ లో అవినాష్ చెప్పినట్లుగానే ఇద్దరి మద్యలో ఏదైనా విషయంలో ఘర్షణ అవుతుంటే అక్కడ ఎవరిసైడ్ కూడా స్టాండ్ తీస్కోలేదు. ఏ ఇష్యూలో కూడా ఎవరివైపు ఉండలేదు. అందువల్ల తనకి వచ్చిన స్క్రీన్ స్పేస్ కూడా తక్కువయ్యింది. ఇద్దరిమధ్యలోకి వచ్చి ఎవరో ఒకరి సైడ్ మాట్లాడి ఉన్నా తన గేమ్ లో జెన్యూనిటీ అనేది ఆడియన్స్ కి రీచ్ అయ్యేది.
5. ఫస్ట్ వీక్ నుంచి గేమ్ లో ఇన్వాల్ మెంట్ అనేది తక్కువగానే అయ్యింది. స్మైల్ తోనే ఆన్సర్ చెప్తే ఆడియన్స్ కి అర్ధం కాలేదు. సుమ వచ్చిన ఎపిసోడ్ లో కవరింగ్ స్మైల్ అంటూ హింట్ ఇచ్చినా కూడా అర్ధం చేసుకోలేకపోయింది. తప్పుంచుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగానే గేమ్ ఆడింది. అఖిల్ అర్ధరాత్రి ఎలిమినేషన్ లో తన లాజిక్ స్మార్ట్ గా ఉన్నాకూడా తనసైడ్ గ్రూప్ అందర్నీ తిప్పుకోలేకపోయింది. తన జెన్యూన్ గేమ్ ని ఎక్కడా చూపించలేకపోయింది. ఏ టాస్క్ లోనూ తను గేమ్ ఆడేందుకు ఎంత సీరియస్ గా ఉన్నాను, టైటిల్ గెలిచేందుకు ఎంత వర్క్ చేస్తున్నాను అనే ఫీల్ ఇవ్వలేకపోయింది.
మిగతా ప్లేయర్స్ లోలేడీ కంటెంస్టెంట్స్ తనని డామినేట్ చేస్తూ గేమ్ లో ముందుకు వెళ్తున్నా లాస్య మాత్రం తను గీసుకున్న రింగ్ లోనే ఉండిపోయింది. అరియానా, హారిక, మోనాల్, వీళ్లు లాస్యని ఓవర్ టేక్ చేసుకుంటూ ముందుకు వచ్చేశారు. సో లాస్య ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. బ్యాడ్ లక్ లాస్య..!