‘దొంగాట’ ‘క్షణం’ ‘అమీ తుమీ’ ‘ గూఢచారి’ వంటి విభిన్న చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు అడివి శేష్. రొటీన్ సినిమాల జోలికి పోకుండా మంచి టేస్ట్ ఉన్న సినిమాలు చేస్తాడు అని ప్రేక్షకుల్లో అడివి శేష్ పై గట్టి నమ్మకం ఉంది. త్వరలోనే ‘ఎవరు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు శేష్. రామ్ జీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘పీవీపీ సినిమాస్’ బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో రెజీనా కూడా ప్రధాన పాత్ర పోషించింది.
‘ఇన్విజిబిల్ గెస్ట్’ అనే చిత్రానికి ఆఫిషియల్ రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే ‘బద్లా’ గా ఈ చిత్రాన్ని అమితాబ్, తాప్సి బాలీవుడ్ లో చేసి సూపర్ హిట్ చేశారు. మరి మన తెలుగులో ఈ చిత్రాన్ని ఎలా రీమేక్ చేశారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక ఆగష్టు 15 న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు ఈమద్యే పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఈ చిత్రంలో కొన్ని సీన్లకి కత్తెర కూడా వేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి :
1) సినిమా బిగినింగ్ మరియు ఇంటర్వెల్ సమయంలో .. ‘స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్’ అని వచ్చే ‘వాయిస్ ఓవర్’ అందరికి తెలిసిందే.
2)లిక్కర్ బ్రాండ్ లేబుల్స్ ను ‘సిజి’ లో కవర్ చేశారు.
3)’జి.ఎస్.టి’ అనే పదాన్ని ఎక్కువ వాడాల్సి రావడంతో దాన్ని మ్యూట్ చేసారు.
4)’సుప్రీమ్ కోర్ట్’ అనే పేరుని కూడా ఎక్కువగా వాడాల్సి రావడంతో దానిని కూడా ‘మ్యూట్’ చేశారట
5)’ ఫ*****గ్ బా****ర్డ్ , ఫ****గ్ అనే పదాలు కూడా ఎక్కువ అవ్వడంతో వాటిని కూడా ‘మ్యూట్’ చేశారట.
6) అశోక్(నవీన్ చంద్ర) సమీరాని(రెజీనా) బలాత్కారం చేస్తూ ఆమె పై కూర్చున్న సన్నివేశాన్ని తగ్గించారట.
ఓవర్ ఆల్ గా ‘ఎవరు’ చిత్రంలో వీటికి సెన్సార్ అడ్డుకట్ట వేసింది. ఇక ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.