Jr NTR: వార్2 సినిమాకు తారక్ అన్ని డేట్స్ ఇచ్చారా.. గెస్ట్ రోల్ కాదంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర షూటింగ్ దాదాపుగా 90 శాతం పూర్తైంది. సైఫ్ అలీ ఖాన్ వల్ల ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతోంది. త్వరలో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో సరైన డేట్ ను ఎంపిక చేసుకుని ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.

త్వరలో తారక్ వార్2 సినిమా షూటింగ్ తో బిజీ కానుండగా ఈ సినిమాకు తారక్ 90 రోజుల డేట్లు కేటాయించారని తెలుస్తోంది. మొదట తారక్ పాత్ర నిడివి పరిమితం అని వార్తలు వచ్చినా 90 రోజులు డేట్స్ కేటాయించడంతో ఈ సినిమా మల్టీస్టారర్ అని క్లారిటీ వచ్చేసింది. వార్2 సినిమాలో తారక్ రోల్ పవర్ ఫుల్ గా ఉండబోతుందని సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయాన్ ముఖర్జీ అద్భుతమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఈ సినిమా నిరాశ పరిచే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. వార్2 సినిమాలో హృతిక్, తారక్ కాంబో సీన్లు హైలెట్ గా నిలుస్తాయని స్నేహితులుగా, శత్రువులుగా ఈ పాత్రల మధ్య పోరాటం ఉండబోతుందని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారని భోగట్టా.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమాకు భారీ రేంజ్ లోనే పారితోషికం అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ భారీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు హిందీలో సైతం భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. తారక్ వేగంగా సినిమాలలో నటించడంతో పాటు వరుసగా సినిమాలను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus