Dasara: ‘దసరా 2’ పై క్లారిటీ వచ్చేసిందిగా..!

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన రా అండ్ రస్టిక్ మూవీ ‘దసరా’ (Dasara) . 2023 మార్చి 30 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీకాంత్ ఓదెల..కి ఇది తొలి సినిమా అయినప్పటికీ ఓ 10 సినిమాల అనుభవం ఉన్న దర్శకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు శ్రీకాంత్.

ఇక నాని నెవర్ బిఫోర్ మాస్ అవతార్ అనే రేంజ్లో ఈ సినిమాలో పెర్ఫార్మన్స్ ఇరగదీసేశాడు. ఇదిలా ఉండగా.. ‘దసరా’ రిలీజ్ అయ్యి ఏడాది కావస్తున్నా.. ఇంకా రెండో సినిమాని మొదలుపెట్టలేదు దర్శకుడు శ్రీకాంత్. రెండో సినిమాని కూడా నానితోనే చేస్తున్నట్టు ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో అది ‘దసరా’ కి సీక్వెల్ అనే డిస్కషన్ మొదలైంది. ‘దసరా’ లో విలన్ చనిపోయాడు. హీరో, హీరోయిన్స్ కూడా కలిసినట్టు చూపించారు.

సో కొత్త పాత్రలతో ఆ సినిమా సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉంది అని అంతా అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ‘దసరా’ కి సీక్వెల్ చేసే ఆలోచన.. శ్రీకాంత్ కి లేదట. నాని- శ్రీకాంత్ ఓదెల.. కాంబినేషన్లో రూపొందే రెండో సినిమా పూర్తిగా డిఫరెంట్ స్టోరీ అట. అస్సలు ‘దసరా’ ఛాయలు ఉండవట. సో ‘దసరా 2 ‘ లేనట్టే..! సో ఇక ‘దసరా’ సీక్వెల్ పై డిస్కషన్స్ కూడా ఉండకపోవచ్చు.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus