Guntur Kaaram: సంక్రాంతి బరిలో ‘గుంటూరు కారం’ కాన్ఫిడెన్స్‌… కారణం ఇదేనట!

  • January 2, 2024 / 05:31 PM IST

‘గుంటూరు కారం’… ఎన్నో వాయిదాలు, మార్పులు తర్వాత పట్టాలెక్కిన ఈ చిత్రాన్ని కచ్చితంగా సంక్రాంతి బరిలో నిలపాలని నిర్మాత ఫిక్స్‌ అయిపోయారు. దాని కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా దాటి ముందుకెళ్లాలని కూడా ఫిక్స్ అయ్యారు. ఐదు సినిమాల మధ్యలో పోటీ జరుగుతున్న సమయంలో ఈ సినిమాను ఎందుకు పండగ పోటీలో దింపుతున్నారు అని అడిగితే… కచ్చితంగా వచ్చే సమాధానం హీరో మహేష్‌బాబు అని అంటారు. అయితే దాంతో పాటు ఈ ధైర్యం కూడా సినిమా టీమ్‌లో ఉంది అంటున్నారు.

‘గుంటూరు కారం’ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన లుక్‌లు, వీడియోలు, పాటలు చూస్తే… సినిమా లైన్‌ ఏంటి అనేది ఎక్కడా అర్థం కావడం లేదు. ఇక లీకులు వచ్చినా అవి పెద్దగా విషయం లీక్‌ చేయలేదు. అయితే సినిమా సన్నిహిత వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్‌ చర్చించబోతున్న పాయింట్‌, చూపించినబోతున్న వ్యక్తుల మధ్య మానసిక సంఘర్షణ, కుటుంబాల మధ్య పెరిగిన కలహాలు అంటున్నారు.

ఇవి నేటితరం జనాలకు ఎక్కుతాయా అంటే… ఇలాంటి డ్రామాను వాళ్లు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కథ ప్రకారం మహేష్ అంటే… వెంకట రమణా రెడ్డి అలియాస్ రవణ గుంటూరులో మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. నలుగురికి సాయం చేయడం, డా వస్తే చితకొట్టేయడం అతనికి అలవాటు. వ్యాపారపరంగా అతనితో వచ్చిన శత్రుత్వానికి, తన కుటుంబంలోని రాజకీయ అంశాలకు ముడిపెట్టిన తీరు సినిమాకు మెయిన్‌ పాయింట్‌ అట.

ఈ క్రమంలో ఇటు కుటుంబం, అటు తన వృత్తిని ఎలా బ్యాలెన్స్‌ చేశాడు అనేదే కథ అంటున్నారు. ఈ పాయింట్‌ వినడానికి ఇలా ఉన్నా త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లేలో ఇంకా టైట్‌గా ఉంటుంది అంటున్నారు. ఈ కారణంగా సినిమాను సంక్రాంతి బరిలో నిలిపారు అని చెబుతున్నారు. అందరికీ తెలిసిన కథ, చూసేసిన కథను తన కళ్లతో తీసి… తెర మీద చూపిస్తారట. మరి ఈ ఆలోచన ప్రేక్షకులకు ఎలా నచ్చుతోందో చూడాలి. మరి జనవరి 12న ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ఘాటు ఏంటో తెలుస్తుంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus